తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న మంత్రి ఏరాసు

By Bojja Kumar

హైదరాబాద్: రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న ఏరాసు ప్రతాపరెడ్డి.... హరిశ్చంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆపరేషన్ దుర్యోధన-2' చిత్రంలో ముఖ్యమంత్రి రోల్ చేస్తున్నారు. ఈ మేరకు తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు ఏరాసు. బుధవారం హైదరాబాద్ లో ఈ డబ్బింగ్ కార్యక్రమం జరిగింది. నిజ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం మంత్రిగారికి ఉందో? లేదో? కానీ సినిమాలో మాత్రం ఆ కల నెరవేరబోతోంది.

జగపతి బాబు, సోనియా అగర్వాల్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రధారులుగా నీలాంజన, చిన్నాప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రూపొందుతోంది. ఈనెల 19న రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఎవరినీ ఉద్దేశించి ఈ చిత్రాన్ని నిర్మించలేదని, మంచివాళ్లను చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్ళను మంచివాళ్లుగా ఈ చిత్రంలో చూపడం లేదని తెలిపారు. కోట శ్రీనివాసరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: ప్రసాద్‌బాబు, నిర్మాతలు: ఎ.బి.శ్రీనివాస్, జిట్టా సురేందర్ రెడ్డి, దర్శకత్వం : హరిశ్చంద్రరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X