twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎర్ర బస్’ సెన్సార్: దాసరి కెరీర్లో 90వ క్లీన్ సర్టిఫికెట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో 151వ చిత్రంగా రూపొందుతున్న ‘ఎర్రబస్సు' చిత్రాన్ని నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 509 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంచు విష్ణు, కేథరిన్ థెరిస్సా హీరో హీరోయిన్లుగా దాసరి ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎర్రబస్సు' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి స్వరాలందించారు.

    తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఎలాంటి అసభ్యత లేదని, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమని క్లీన్ ‘U' సర్టిఫికెట్ జారీ చేసింది. దాసరి కెరీర్లో ఇప్పటి వరకు 150వ సినిమాలు చేసారు. ఈ చిత్రం ‘U' సర్టిఫికెట్ అందుకున్న 90వ చిత్రం కావడం విశేషం.

    ERRABUS GIFTED CLEAN U CERTIFICATE

    సినిమా గురించి దాసరి మాట్లాడుతూ ''తాతమనవళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే చిత్రమిది. కుటుంబమంతా కలిసి చూసేలా తీర్చిదిద్దాను. సెంటిమెంట్‌తో పాటు వినోదానికీ ప్రాధాన్యముంది. విష్ణు ఉత్తమ నటనను కనబరిచాడు. 'ఎర్రబస్సు' అనే పేరును ఒక గుర్తుగా వాడాం. ఎర్రబస్సు ఎక్కినోళ్లు ఎంత గట్టివాళ్లు అనే విషయం అంతర్లీనంగా అర్థమవుతుంటుంది'' అన్నారు.

    నారాయణస్వామి ఓ పల్లెటూరి మనిషి. ఆయన మనవడికి మాత్రం అమెరికా వెళ్లాలనేది లక్ష్యం. చిన్నప్పట్నుంచి తనకి ఓ స్నేహితుడిలా ఉంటూ వచ్చిన తాతయ్యని మూడు నెలల పాటు బాగా సంతోష పెట్టాలని హైదరాబాద్‌ తీసుకొస్తాడు. ఆ మూడు నెలల కాలంలో ఏం జరిగింది? పట్నం వచ్చిన తాతయ్య మనవడి కోసం ఏం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు దాసరి నారాయణరావు.

    English summary
    The censor process of Dr. Dasari’s ERRABUS is completed today. Apart from issuing clean’ U’ certificate the censor authorities have appreciated the film. Having got the clean U certificate now the ERRABUS unit is gearing up to release the film on 14th Nov as declared earlier. Incidentally this film ERRABUS happened to be the 90th film of Dasari to get a clean U certificate. Censor people said that in the past few years this is the first film to get a clean U certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X