»   » వాళ్ల మగతనం ఎక్కడ షేక్‌ అవుతుందో అని మగాళ్లు కంగారు పడిపోతున్నారు: ఈషా గుప్తా

వాళ్ల మగతనం ఎక్కడ షేక్‌ అవుతుందో అని మగాళ్లు కంగారు పడిపోతున్నారు: ఈషా గుప్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్ ఈషా గుప్తా అందాల ఆరబోత విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో...మరో వైపు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ దర్శనమిస్తూ.....అందాలను ఆరాధించే వారిని తన అభిమానులుగా మార్చుకుంటోంది.ఈ అందాల ప్రదర్శణకి అంతూ పొంతూ లేకుండాపోతోంది. ఇప్పటికే ఇషా అందాలకి పిచ్చెక్కిపోతూంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్టు రోజుకో ఫొటో చూపించేస్తోంది. ఈ దెబ్బకి మరిన్ని అవకాశాలు ఇశాకోసం క్యూ కడతాయనటం లో సందేహమే లేదు...

ఇంటర్నెట్‌లో సెగలు

ఇంటర్నెట్‌లో సెగలు

బాలీవుడ్లో హాట్ హీరోయిన్లు ఎంతో మంది ఉన్నప్పటికీ బికినీకి పర్‌ఫెక్టుగా సూటయ్యే శరీరాకృతి కలిగిన వారు కొందరు మాత్రమే. ఈ నేపథ్యంలో ఇషా గుప్తా అందాలకి మంచి డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమెండో2 చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించి ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంలో విఫలమైన ఇషా గుప్తా తాజాగా చేసిన ఓ ఫోటోషూట్‌ ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్నది.

దాదాపు నగ్నంగా

దాదాపు నగ్నంగా

ఫొటోషూట్ కోసం దాదాపు నగ్నంగా మారిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇషా గుప్తా....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సోషల్ మీడియా క్వీన్ గా నిలిచింది.

జన్నత్-2

జన్నత్-2

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది.

ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చింది

ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చింది

ఐతే ఈ ఫొటో షూట్లను ఎంజాయ్ చేసేవాళ్లు చేశారు కానీ.. ఇంకొందరు మాత్రం ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు వ్యక్తిగతంగా హేట్ మెయిల్స్.. మెసేజెస్ చాలా వచ్చినట్లు కూడా చెప్పింది ఈషా గుప్తా. వాటన్నింటికీ సమాధానంగా ఆమె ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చింది.

అందముంది.. చూపిస్తున్నా.. మీకేంటి?

అందముంది.. చూపిస్తున్నా.. మీకేంటి?

నాకు అందముంది.. చూపిస్తున్నా.. మీకేంటి.. అంటూ ఆమె సూటిగా ప్రశ్నించింది ఈ స్టేట్మెంట్లో.‘‘ప్రపంచంలో ఇన్ని సమస్యలుండగా నా ఫొటో షూట్‌ గురించి ఇంత చర్చ అవసరమా? మన చుట్టూ ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ముందు వాటి గురించి మాట్లాడండి.

తిడుతూ మెయిల్స్‌ పెట్టారు

తిడుతూ మెయిల్స్‌ పెట్టారు

నన్ను తిడుతూ చాలామంది మెయిల్స్‌ పెట్టారు. వాళ్లను తిడుతూ సమాధానం ఇవ్వలేదు. మరిన్ని ఫొటోలు పోస్ట్‌ చేశాను. నేను అందంగా ఉంటాను. నా అందాలను బంధించిన ఫొటోలు నాకు నచ్చాయి. వాటిని పంచుకున్నాను. అలాంటపుడు మీకేంటి? ఓ భారతీయ అమ్మాయి అందాల ఆరబోస్తుంటే చూసి వాళ్ల మగతనం ఎక్కడ షేక్‌ అవుతుందో అని మగాళ్లు కంగారు పడిపోతున్నారు.

నేనే అసలు సిసలు భారతీయురాల్ని

నేనే అసలు సిసలు భారతీయురాల్ని

ఆత్మవిశ్వాసం లేని ఆడవాళ్లే నన్ను విమర్శిస్తున్నారు. నా ఫొటోలపై వస్తున్న కామెంట్లు చూస్తుంటే నవ్వొస్తోంది. ప్రపంచం తిరోగమనంలో వెళ్తోందా అనిపిస్తోంది. ‘అసలు ఓ భారతీయ అమ్మాయి చేసే పనేనా?, ‘ఇషా భారతీయురాలే కాదు'.. ఈ తరహా విమర్శలే నన్ను ఎక్కువ బాధపెడుతున్నాయి. నన్ను విమర్శించే అందరి కంటే నేనే అసలు సిసలు భారతీయురాల్ని. నా తండ్రి దేశానికి ఎంతో సేవ చేశారు. మరి మీ తండ్రి చేశారా?'' అని ప్రశ్నించింది ఈషా.

English summary
Esha Gupta said to Trollers “I am more loved than hated and no one can say these pictures are vulgar. I am comfortable with my boy and it has been shot aesthetically. What is other people issues with my pictures?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu