వీపు మీద గాయిత్రి మంత్రం పచ్చబొట్టుతో హీరోయిన్..వివాదం
తిరుమల : గాయత్రి మంత్రాన్ని వీపుపై పచ్చబొట్టు పొడిపించుకుని సినీ నటి ఇషా డియోల్ తిరుమలకు రావడం వివాదాస్పదమైంది. తల్లి హేమమాలినితో కలసి ఇషాడియోల్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. బయటకు వస్తున్న సమయంలో ఆమె వీపుపై ఉన్న పచ్చబొట్టును గమనించిన భక్తులు, కొందరు ఉద్యోగులు పలురకాలుగా చర్చించుకున్నారు. శరీరంపై గాయత్రి మంత్రాన్ని పచ్చబొట్టుగా వేసుకోవడాన్ని తప్పుపట్టారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని బాలీవుడ్ అలనాటి అందాలతార హేమామాలిని తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమె వెంట కుమార్తె ఇషాడియోల్ కూడా ఉన్నారు. ఇషా వివాహం జరిగిన నేపథ్యంలో నూతన దంపతులతో కలిసి స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు హేమామాలిని చెప్పారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇషాడియోల్ తన వీపుపై గాయత్రి మంత్రాన్ని పచ్చబొట్టుతో ముద్రించుకున్న సంస్కృతం అక్షరాలు స్పష్టంగా కనిపించాయి. చాలా సేపు దానిపై చర్చ జరిగింది. అయితే ఈ విషయమై ఇషా డయోల్ ఏమీ వ్యాఖ్యానించలేదు.


Click it and Unblock the Notifications












