For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మేం ఎప్పుడో విడిపోయాం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులుంటాయ్.. విడాకులపై ఏస్తర్ ఎమోషనల్ పోస్ట్

  |

  ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట (సింగర్ నోయల్, హీరోయిన్ ఏస్తర్) ఏడాది తిరక్కుండానే వేరు పడింది. అయితే ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. తాము ఎప్పుడో విడిపోయామని, కానీ ఇప్పుడు అధికారికంగా కోర్టు ప్రకటించడంతో ఇలా చెబుతున్నామని నోయల్, ఏస్తర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ పోస్ట్ చేశారు. ఇక వీరిద్దరి విడాకుల విషయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏస్తర్ మాత్రం విడాకుల విషయం స్పందిస్తూ.. సుధీర్ఘమైన పోస్ట్ చేసింది.

  విడిపోయాము..

  విడిపోయాము..

  గతేడాది నుంచి నన్న తరుచుగా అడుగున్న ప్రశ్నలకు సమాధానం ఇదే. ఈ విషయం గురించి మీరు ఇప్పటికే ఎన్నో రకాల ఊహలు, రూమర్స్, కామెంట్స్ చేస్తూ వచ్చారు. మీరు నా సమాధానం కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అవును. మేము అధికారికంగా విడిపోయాము అని ఏస్తర్ ప్రకటించింది.

  ఎప్పుడో విడిపోయాం..

  ఎప్పుడో విడిపోయాం..

  ఈ విషయాన్ని ప్రకటించడానికి దాదాపు ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నాను. అయితే ఇది చట్టబద్ధంగా, అధికారికంగా నిర్ణయించిన తరువాతే చెబుదామని ఊరుకున్నాను. నోయెల్, నేను 2019 జనవరి 3 వ తేదీన వివాహం చేసుకున్నాము. మాకు పెళ్లైన కొద్ది రోజుల్లోకే మనస్పర్దలు వచ్చాయని ఏస్తర్ తెలిపింది.

  అందుకే చెబుతున్నాం..

  అందుకే చెబుతున్నాం..

  మేము వెంటనే గత ఏడాది జూన్‌లో మ్యూచువల్ డైవర్స్ కోసం దాఖలు చేశాము. కోర్టు నుంచి సరైన సమాచారం, విడాకులు మంజూరు చేసిన తరువాతే బయటకు చెప్పాలని ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాము. నేను ఎదైనా సరే ముక్కు సూటిగా, నిజాయితీగా ఉంటాను. ఏది చెప్పినా అలాగే చెబుతాను. నోయల్, నా జీవితంతో ముడిపడి ఉన్న వారందరికీ ఈ విషయం తెలియాలని నేను ఇప్పుడు చెప్పాను అంటూ ఏస్తర్ పేర్కొంది.

  దయచేసి అర్థం చేసుకోండి..

  దయచేసి అర్థం చేసుకోండి..

  ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నసున్నితమైన అంశాలను దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అంతేకాకుండా నా ఈ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, ఎప్పటిలానే మీరు నా వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మనమందరం మనుషులం ... మన జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి ... ప్రతీ ఒక్కరికి ఇలాంటి స్థితి ఏర్పడవచ్చ.. బంధాలు విఫలం కావచ్చు.. అలాంటి సమయంలో ఎంతో ఒత్తిడి, అది ఎంత క్లిష్టంగా మాకు తెలుసు ...అటువంటి సమయాల్లో మీ నెగెటివ్ కామెంట్స్, ప్రశ్నలు లాంటివి మరింత బాధను కలిగిస్తాయి అంటూ ఏస్తర్ ఎమోషనల్ అయింది.

  Valayam Teaser Out | Laksh Chadalavada | Digangana
  ఇదే చివరి ప్రకటన..

  ఇదే చివరి ప్రకటన..

  కాబట్టి ఈ విషయంపై ఇది నా ఏకైక, చివరి ప్రకటన. దయచేసి వీటి గురించి మళ్లీ నన్ను ఎక్కడా అడగకండి.. రకరకాల ప్రశ్నలు, ఇంటర్వ్యూలు, మీడియా దృష్టి మరల్చేందుకు పాట్లు పడటం, వ్యాఖ్యలు, నిజమైన లేదా వర్చువల్ ఏ రూపంలోనైనా చర్చించి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం నా పని కాదు. నేను చెప్పేది ఇదొక్కటే. నన్ను అర్థం చేసుకున్నందుకు, నాకు మద్దతు తెలిపినందుకు, చూపించిన ప్రేమ, మద్దతు, దయ, ప్రేయర్స్, ఆశీర్వాదాలు నాకు ఎప్పటికీ అలాగే కావాలి.. ఉండాలి. మీరు నాపై ప్రేమను కురిపించండ'ని ఏస్తర్ కోరుకుంది.

  English summary
  Ester Noronha About Divorce With Noel Sean. Finally... Here's the answer to the most frequently asked question to me in the last 1 year... which many of you have speculated, guessed and even discussed on the comments of my posts for a very long time now and are eagerly waiting for my response or confirmation...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X