»   » రెడ్ స్టార్ మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి విషమం

రెడ్ స్టార్ మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి విషమం

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విప్ల‌వ న‌టుడు, నిర్మాత‌, రెడ్‌స్టార్ మాదాల రంగారావు గుండెపోటుకు గురి కావడంతో హైద‌రాబాద్ స్టార్ హాస్పిట‌ల్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయన కుమారుడు డా.మాదాల ర‌వి మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.

  గతేడాది మే నెల‌లో నాన్నకు తీవ్ర గుండెపోటురాగా చెన్నైలోని విజ‌య హాస్పిట‌ల్‌లో చేర్పించ‌డం జ‌రిగింది. అపుడు ప‌రిస్థితి విష‌మించ‌డంతో హైద‌రాబాద్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌కు అంబులెన్స్‌లో త‌ర‌లించగా డా.గోపీచంద్, వారి బృందం చాలా క్రిటిక‌ల్ గుండె ఆప‌రేష‌న్ చేసి నాన్న‌గారిని కాపాడారు. అప్ప‌టి నుండి ఆయ‌న హైద‌రాబాద్‌లో వైద్యుల పర్యవేక్షనలో ఉంటున్నారు. మే 19న మరోసారి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన స్టార్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు... అని తెలిపారు.

  eteran Actor Madala Ranga Rao Health In Critical Condition

  ప్ర‌స్త‌తం మాదాల రంగారావు పూర్తిగా వెంటిలేట‌ర్‌పై, డ‌యాలిసిస్‌లో ఐ.సి.యు లో ఉన్నారని, స్టార్ హాస్పిట‌ల్ సిబ్భంది ఆయ‌న‌ను ర‌క్షించ‌డం కొర‌కు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని, ఇంకో 48 గంట‌ల గడిస్తే తప్ప ఆయన ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయలేమని వైద్యులు చెప్పినట్లు మాదాల రవి తెలిపారు.

  ఎర్రమల్లెలు, యువతరం కదిలింది, నవోదయం, జనం మనం, మరో కురుక్షేత్రం, స్వరాజ్యం, విప్లవ శంఖం, ప్రజాశక్తి లాంటి విప్లవ చిత్రాలతో మాదారల రంగారావు అప్పట్లో రెడ్‌స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు.

  English summary
  Veteran Actor Madala Ranga Rao Health In Critical Condition. Veteran actor Madala Ranga Rao, popular for films like ‘Yuvataram Kadilinidi’ and ‘Erra Mallelu’, has been admitted in Star Hospital in Hyderabad. His condition is critical, say doctors. He has been suffering from heart-related ailments in recent years. He is now under ventilator.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more