Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'జబర్దస్త్' వేణును ప్రశ్నించిన ఓయు పోలీసులు
హైదరాబాద్: గౌడ కులస్థులను కించపరచారనే ఆరోపణను ఎదుర్కుంటున్న జబర్దస్త్ వేణును, ఆయన జట్టును పోలీసులు ప్రశ్నించారు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ టీవీ షో ఎపిసోడ్‌లో వేణు బృందం గౌడ కులస్థులను అవమానించారనే ఆరోపణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో కల్లు పోసే మహిళ నృత్యం చేస్తూ వినోదం పంచే దృశ్యం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు మంగళవారం సాయంత్రం వేణు బృందాన్ని ప్రశ్నించారు.
ఈ ఎపిసోడ్ తీవ్ర వివాదానికి గురై, ఫిల్మ్ నగర్‌లో కమెడియన్ వండర్స్ వేణుపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసే దాకా వెళ్లిన విషయం తెలిసిందే ఈ దాడిలో వేణుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన స్నేహితులు చికిత్స నిమిత్తం వేణును అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఎపిసోడ్‌పై ప్రక్క వేణు కు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
ఆ మధ్య వేణు ఓ టీవీలో ప్రసారమైన కామెడీ షోలో గౌడ కులాన్ని కించపరిచేవిధంగా స్కిట్ చేయడంపై గౌడ సంఘం వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రామిక గౌడ మహిళల జీవన విధానాన్ని అవమానపర్చిన జబర్దస్థ్ కార్యక్రమంపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. దీంతో కిందపడిపోయిన వేణు వారి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న ఫిలింనగర్ అవుట్‌పోస్ట్‌లో దూరాడు.
గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టికూట రామారావు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ విద్యార్థులు ఫిలించాంబర్ వద్దకు చేరుకున్నారు. వేణు ప్రదర్శించిన స్క్రిఫ్ట్ వల్ల కోటి మంది గౌడ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.