»   » ఈటీవీ సుమన్ 'నాన్ స్టాప్' చిత్రం ఏమైంది?

ఈటీవీ సుమన్ 'నాన్ స్టాప్' చిత్రం ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈటీవీ సుమన్ గా పేరొందిన రామోజీరావు గారి కుమారుడు సుమన్ బాబు చేసిన రెండో సినిమా ప్రయత్నం కూడా ఫలించలేదు. మొదటి చిత్రం ఉషా పరిణయం ఓ స్టేజీ డ్రామా లా ఉందని అందరూ విమర్శిస్తే..ఈ సారి పూర్తి ఎంటర్టైనర్ అందిస్తానని ఈ నాన్ స్టాప్ బోర్ చిత్రాన్ని తీసారు. ఈ చిత్రంలో సుమన్ ఓ డాన్ గా కనిపిస్తారు. కథ ప్రకారం అతనికో చెల్లెలు మధుప్రియ (యామిని) ఒక కాసనోవాలాంటి కుర్రాడి ప్రేమలో ఇరుక్కుంటుంది. అయితే అన్న ఆ మాటలు చెప్పినా ఆమె నమ్మదు. ఈలోగా డాన్‌గా తన వద్ద అప్పు తీసుకున్న ఒక నిర్మాతను బెదిరించడానికి షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లి... అనుకోకుండా సినీ హీరోగా కూడా మారుతాడు విష్ణు. ఆ చిత్ర నిర్మాత పాశర్లపూడి పిచ్చయ్య (ఎం.ఎస్‌.నారాయణ). అతను సుమన్ ని చూడగానే...తన రోమియో కొడుకు అజయ్‌కి, సుమన్ చెల్లెలితో పెళ్లి చేసి తన సమస్యల నుంచి బయటపడాలనుకుంటాడు. అందుకుతగినట్లుగా పిచ్చయ్య పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేస్తూంటాడు. ఈలోగా డాన్‌గా సుమన్ తరఫున హత్యలు చేయడం వంటి వ్యవహారాలు చక్కబెడుతున్నది ఇంద్ర (ఇంద్రనాగ్‌) అని తెలుస్తుంది.అప్పుడు సుమన్ ఏం చేసాడు...ఆ హత్యలనుంచి బయిటపడి తన చెల్లి జీవితాన్ని ఎట్లా చక్కదిద్దాడనే విధంగా కథనం నడుస్తుంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, క్రియేటివ్‌ డిజైనర్‌, ప్రాజెక్ట్‌హెడ్‌: ఇంద్రనాగ్‌ చేస్తే.. నిర్మాతగా సుమన్‌బాబు వ్యవహించారు. ఇక దర్శకత్వం భాద్యతలను ఎమ్‌.జె.ఆర్‌.పోషించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu