»   »  ఉగాది రోజే రిలీజ్ అవుతోంది

ఉగాది రోజే రిలీజ్ అవుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాని, మాళివిక నాయర్ జంటగా స్వప్న సినిమా పతాకంపై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రం ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో నాని మాట్లాడుతూ ‘ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటినుండి ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెరిగాయి. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉగాది రోజున విడుదలయ్యే మా చిత్రం ఉగాది పచ్చడిలానే అన్ని ఎలిమెంట్స్ కలిపి ఉంటుంది' అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాత స్వప్న మాట్లాడుతూ.. ‘ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని భారతదేశంలో ఇంతకుముందు ఎవ్వరూ దృశ్యరూపమివ్వని ఎత్తయిన హిమాలయాల్లో చిత్రీకరించాం. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో కూడా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఇది నా మొదటి సినిమా. మా చిత్ర బృందం అంతా ఫ్యామిలీలా కలిసి కష్టపడ్డాం. ప్రస్తుతం వస్తున్న సినిమాలకి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటోంది. మా సినిమా పది సంవత్సరాల తరువాత చూసినా కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో తీశాం' అన్నారు. విజయ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రిషి అనే క్యారెక్టర్‌లో నటించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కి నా థాంక్స్. నాని ఇలాగే మంచి సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా' అన్నారు.

Evade Subramanyam to release for Ugadi

విలక్షణ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో ఇప్పటికే విడుదలైంది.

నాని మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం 35మంది హిమాలయాలకు వెళ్లి కష్టపడ్డాం. ఆ సమయంలో బతకడానికి ఏమీ అక్కర్లేదు, ఆలుగడ్డలుంటే చాలనుకునే పరిస్థితి మాది. మా కృషికి తగ్గ ఫలితాన్ని విజయం రూపంలో ప్రేక్షకులు అందిస్తారని ఆశ'' అన్నారు.

''నా కథని నమ్మారు నిర్మాతలు. అందుకే ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేశాం'' అన్నారు చిత్ర దర్శకుడు. ''అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమా చేయాలనే సంకల్పంతో ఈ కథను ఎంచుకొన్నాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అన్నారు నిర్మాత.

నాని ట్వీట్ చేస్తూ......‘వినూత్న కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 36 మంది యూనిట్ సభ్యులు ఎవరెస్ట్ బేస్ క్యాంపులో సముద్రమట్టానికి 5300 మీటర్ల ఎత్తులో చిత్రీకరణ జరిపారు. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. అయితే అక్కడ చలికి తట్టుకోలేక 10 మంది మధ్యలో వెనుతిరిగగా, చివరి వరకూ 26 మంది ఉన్నారు. సగం పర్వత శ్రేణులలో, సగం నగరంలో ఈ సినిమా చిత్రీకరణ చేశాం. ' అన్నారు.

చిత్రం హీరోయిన్ రితి వర్మ మాట్లాడుతూ.... నా ఫేవరెట్ హీరోలలో నాని ఒకరు. ఆయన సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ సమయంలో నాని హెల్ప్ చేస్తున్నారు. ఈ సినిమాలో నేను బాగా డబ్బులున్న అమ్మాయిగా నటిస్తున్నాను. తండ్రి అంటే చాలా ఇష్టం. అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపిస్తాను. అని రితు వర్మ చెప్పింది.

తన జీవితం గురించి తెలుసుకోవడానికి ఓ కుర్రాడు మొదలు పెట్టె జర్నీలో తనకు ఎదురైన అనుభవాలు సమాహారమే కథాంశం. రితు వర్మ, మలయాళ భామ మాళవిక నాయర్ నాని సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేశ్,.నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేస్తున్నారు.

English summary
Nani's Evade Subramanyam to release for Ugadi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu