»   » బోయ్ ఫ్రెండ్, బార్ ఓనర్ ..రెండు సార్లు రేప్ చేసారంటూ నటి లేఖ, సంచలనం

బోయ్ ఫ్రెండ్, బార్ ఓనర్ ..రెండు సార్లు రేప్ చేసారంటూ నటి లేఖ, సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజెల్స్‌: గతంలో తాము అత్యాచారానికి గురి అయ్యామని బహిరంగంగా చెప్పటానికి ఎవరూ ధైర్యం చేసేవారు కాదు. కానీ కాలం మారింది. తమ లోపల ఆవేదనలను, ఆలోచనలను ఆవిష్కరించటానికి ఎవరూ భయపడటం లేదు. ముఖ్యంగా సెలబ్రెటీలు ధైర్యంగా మీడియా ముందు పెదవి విప్పుతున్నారు.

ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ నుంచి , బాలీవుడ్ నుంచి కొందరు నటీ మణులు తమ జీవితంలో జరిగిన చీకటి కోణాలను ఆవిష్కరించారు. వారి మాటలతో చాలా మంది దైర్యం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అలాగే మరో హాలీవుడ్‌ నటి, సింగర్‌ ఇవాన్‌ రేచెల్‌వుడ్స్‌ చిన్నవయసులోనే రెండుసార్లు అత్యాచారానికి గురయ్యారని చెప్పుకొచ్చారు.

ఈ విషయాన్ని ఆమె లేఖగా రాసారు. సాధారణంగా నటీనటులు ఇలాంటి విషయాలు బహిరంగంగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ చాలా మందికి ప్రేరణగా ఉంటుందని తన జీవితాన్ని ఆమె మీడియా ముందు ఆవిష్కరించారు. ఇంతకీ ఆమె ఏమి చెప్పారు...అసలు ఏమి జరిగింది అంటే...

 అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని

అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని

22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. రేచెల్‌ తాను జీవితంలో ఎదురుకొన్న ఒడిదుడుకులను ఎలా అధిగమించారో రోలింగ్‌స్టోన్‌ మ్యాగజీన్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో బాధాతప్త హృదయాన్ని మ న ముందాచారామె.

 నన్ను నేను

నన్ను నేను

‘అమెరికాలో ఎదిగిన అమ్మాయిగా ఇలాంటి ఘోర అనుభవాలను ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందోనని నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. నా జీవితంలో మొత్తానికి ఏం జరిగిందో కచ్చితంగా చెప్పలేను. జరిగిందేందో జరిగిపోయింది.

 నింద వేసుకోను

నింద వేసుకోను

కానీ అది ఇప్పటికీ నా జీవితంపైప్రభావం చూపుతోంది. నేను ఎదుర్కొన్న ఘటనలపై లోతుగా ఆలోచిస్తుంటాను. కానీ నేనేదో గుర్తింపుపొందాలని ఇలాంటివి చేశానని నాపై నేను నిందవేసుకోను. జరిగినదానికి సిగ్గుపడను.

 మాట్లాడుకోవాల్సిన

మాట్లాడుకోవాల్సిన


సెక్సిజం, వివక్ష అనే ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఇది దాచిపెట్టాల్సిన విషయం కాదు. దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా క్లిష్టమైన సమస్య అంటూ ఆమె తన మనస్సులో ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

 ఎప్పుడూ ఒకే రకంగా

ఎప్పుడూ ఒకే రకంగా

నేనింకా బతికే ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. కానీ అంతా సర్దుమణగలేదు. ఇలాంటి ఘటనలు జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. అలా అని గతాన్ని మర్చిపోలేము అని చెప్పడంలేదు. మనం ఎప్పుడూ ఒకే రకంగా ఉండము.

 రెండు సార్లు అత్యాచారం

రెండు సార్లు అత్యాచారం

బహుశా నేను ఇంకా గతాన్ని మర్చిపోయే స్థితిలో లేనేమో. కాబట్టి నేను చెప్పేదేంటంటే.. అవును నాపై రెండు సార్లు అత్యాచారం జరిగింది. ఓసారి నా బాయ్‌ఫ్రెండ్‌ రేప్‌ చేశాడు. అతనే చేశాడా లేదా అన్న విషయం తెలిసేలోపే అంతా అయిపోయింది. అయినా ఈ విషయం చెప్పినా ఎవరు నన్ను నమ్ముతారు?

 అది నా పొరపాటే..

అది నా పొరపాటే..

రెండోసారి ఓ బార్‌ యజమాని చేశాడు. ఇది మాత్రం నా పొరపాటు వల్లే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మోసపోయినప్పుడు రెండోసారి పోరాడి ఉండాల్సింది. కానీ నాకు భయమేసింది.

 అంత చిన్న వయస్సులోనే..

అంత చిన్న వయస్సులోనే..

ఇవి నా పొరపాటు వల్ల జరిగాయో లేదో తెలీదు కానీ ఈ సంఘటనల కారణంగా 22 ఏళ్ల వయసులో ఆత్మహత్యచేసుకోవాలనుకున్నాను. కానీ ఆలోచిస్తే నా తప్పేంలేదని తెలిసి నిర్ణయం మార్చుకున్నాను' అని తన లేఖలో రాసుకొచ్చారు రేచెల్‌.

 ఫ్యాన్స్ ధైర్యం

ఫ్యాన్స్ ధైర్యం

రేచెల్‌ ఈ లేఖ పోస్ట్‌ చేసిన అనంతరం కొంతకాలం పాటు సోషల్‌మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. రేచెల్‌ లేఖ పోస్ట్‌ చేసిన అనంతరం ఎందరో అభిమానులు ఆమె ధైర్యానికి మెచ్చుకుని మద్దతుగా నిలిచారు.

ఆ లేఖ ఇదే

ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లెటర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

కొద్ది రోజులు శెలవు

ఈ లేఖ పోస్ట్ చేసాక రేచల్ ...కొద్ది రోజులు సోషల్ మీడియాకు తను శెలవు ప్రకటించింది. అది ఆమె అభిమానులను భాధపెడుతున్న అంశం.

సినిమాలు, సీరియల్స్

సినిమాలు, సీరియల్స్

29 ఏళ్ల రేచెల్‌ ప్రముఖ హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ టీవీ సిరీస్‌ ‘వెస్ట్‌వరల్డ్‌'తో గుర్తింపుపొందారు. స్ట్రేంజ్ మ్యాజిక్, ఇన్ టు ది పారెస్ట్, ఎ కేస్ ఆఫ్ యు వంటి చిత్రాల ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. డిగ్గింగ్ టు చైనా అనే ఓ లో బడ్జెట్ చిత్రంతో ఆమె కెరీర్ మొదలెట్టారు.

English summary
Evan Rachel Wood does not want to "stay silent any longer."The star of HBO's "Westworld" revealed in an open letter on Twitter and an interview with Rolling Stone that she had been raped twice. "I don't believe we live in a time where people can stay silent any longer," she wrote in an email to Rolling Stone that she posted to Twitter on Monday. "Not given the state our world is in with its blatant bigotry and sexism. It should be talked about because its swept under the rug as nothing and I will not accept this as 'normal.' It's a serious problem."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu