ఫాన్స్ కోసం మొత్తానికి సాధించింది.. ప్రభాస్‌ని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్న హాట్ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ ఎవిలిన్ శర్మ ప్రభాస్ సాహో చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎవిలిన్ శర్మ సాహో చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది. సాహో చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో శరవేగంగా జరుగుతోంది. తాజగా ఎవిలిన్ శర్మ ప్రభాస్ తో దిగిన ఫోటోని తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
అభిమానుల కోరిక మేరకు మొత్తానికి ప్రభాస్ తో ఫొటో దిగానని చెప్పుకొచ్చింది. ఈ బాలీవుడ్ బ్యూటీ మరో కోరికని కూడా ప్రభాస్ ముందు ఉంచడం విశేషం. ప్రభాస్ ప్రస్తుతం ట్విట్టర్ లో లేడు. అతడిని ట్విట్టర్ లోకి తీసుకుని వచ్చేందుకు కన్విన్స్ చేస్తున్నాని దానికి అభిమానుల సహకారం కూడా అవసరం అంటూ పేర్కొంది.

మీరు కూడా ప్రభాస్ ట్విట్టర్ లోకి రావాలని భావిస్తే రీ ట్వీట్ చేయండి అంటూ కోరింది. మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్ సోషల్ మీడియాలోకి తీసుకురావడానికి ఈ అమ్మడు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ జాతీయ వ్యాప్తంగా వ్యాపించింది. పైగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావడంతో.. ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడమే ఆలస్యం మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ రావడం ఖాయం. మరి ప్రభాస్ ఎవిలిన్ శర్మ కోరిక మేరకు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











