»   » అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎన్టీఆరే ఎవర్ గ్రీన్!

అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎన్టీఆరే ఎవర్ గ్రీన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమాకు ఎఎన్ ఆర్, ఎన్టీఆర్ రెండు కళ్లు". చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పే మాట ఇది. నటనలో హావబావాల్లో ఎవరి శైలి వారిది. కామన్ హీరోగా ఎన్టీఆర్, క్లాస్ హీరోగా అక్కినేని ప్రజాదారణ చూరగొన్నారు. అయితే పాపులారిటీలో మాత్రం ఎన్టీఆర్ దే పై చేయి. కష్ణుడిగా, రాముడిగా ఆయన తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా నిలిచారు. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజా సంఘటన దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. గోల్డ్ స్టోన్ సంస్థ తెలుగు బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్ ను కలర్ లోకి తీసుకొస్తోంది.

తాజాగా మాయాబజార్ ను కలర్ లోకి తీసుకొచ్చి, ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, చాలా అద్భుతంగా మంచి కలెక్షన్ల తో నడుస్తోంది. త్వరలో 11 చిత్రాలను కలర్ లోకి తీసుకురానుంది. అందులో ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన గుండమ్మకథ, మిస్సమ్మ మినహాయిస్తే, అక్కినేని చిత్రం ఒక్కటి లేకపోవడం గమనార్హం. కలర్ లోకి తెచ్చే 'షావుకారు", ఉమాచండీగౌరీశంకరుల కథ", సత్యహరిశ్చంద్ర", సిఐడి,'పెళ్లిచేసి చూడు", ఇలా అన్ని చిత్రాల్లోనూ కథానాయకుడు ఎన్టీఆరే కావడం విశేషం. అక్కినేనిని స్టార్ హీరో చేసిన 'దేవదాసు" ఈ లిస్ట్ లో లేకపోవడం విచిత్రం. ఈ లెక్కన అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎన్టీఆరే ఎవర్ గ్రీన్.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu