»   » మహిళా దినోత్సవం సందర్భంగా మంజుల ఇలా.....

మహిళా దినోత్సవం సందర్భంగా మంజుల ఇలా.....

Posted By:
Subscribe to Filmibeat Telugu

షో లాంటి భిన్నమైన చిత్రంతో జాతీయ అవార్డు కూడా గెల్చుకొన్న మంజుల- కావ్యాస్ డైరీ.. ఆరెంజ్ తో పాటు కొన్ని తమిళ్.. మలయాళం మూవీస్ లోనూ యాక్ట్ చేసింది. అయితే నిర్మాతగా కొన్ని ఫెయిల్యూర్స్ ను చవిచూడాల్సి వచ్చింది. దీంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న మంజుల సడెన్ గా ఒక్కసారి మళ్ళీ వెలుగులోకి వచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమె కొన్ని వ్యాఖ్యలు చేసారు.

పెద్ద స్టార్ డాటర్ అయిఉండి కూడా

పెద్ద స్టార్ డాటర్ అయిఉండి కూడా

ఒక సూపర్ స్టార్ కి కుమార్తె, మరో సూపర్ స్టార్ కి సోదరి ఘట్టమనేని వారసురాలు మంజుల చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. నటిగానూ గుర్తింపు తెచ్చుకొని 'షో' లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. అంత పెద్ద స్టార్ డాటర్ అయిఉండి కూడా ఆ సినిమాని తీయటానికి చాలానే సమస్యలని ఎదుర్కొన్నారామె

జాతీయ అవార్ద్ సినిమా

జాతీయ అవార్ద్ సినిమా

జాతీయ అవార్ద్ సినిమా అయినా రిలీజ్ అయ్యే వరకూ ఆ సినిమా సంగతి రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఎందుకంటే కృష్న అభిమానులు మంజులని కూడా తమ ఇంటి అమ్మాయిగానే భావించారు. ఆమె సినిమాల్లో గ్లామర్ గా కనిపిస్తుందేమోనన్న భాదతో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవ్వకూడదంటూ బలంగా వ్యతిరేకించారు. అదే కొడుకు హీరో అవుతూంటే మాత్రం స్వాగతించటం గమనార్హం

సూపర్ స్టార్ ఫాన్స్

సూపర్ స్టార్ ఫాన్స్

హీరోయిన్ గా అరంగేట్రం చేయిస్తున్నారు అనే వార్తలు చూసి సూపర్ స్టార్ ఫాన్స్ ఆత్మహత్యలకి కూడా ఒడిగట్టిన రోజులు ఉన్నాయి. ఆ రియాక్షన్ చూసి కృష్ణ ఆ ఆలోచన మానుకున్నారు కూడా. ఆమె ఆ తరవాత సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఇష్టం తో నిర్మాతగా కొన్ని సినిమాలు తీసారు. ఇప్పుడిప్పుడే దర్శకురాలిగా కూడా మారబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

మళ్ళీ వెలుగులోకి

మళ్ళీ వెలుగులోకి

కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న మంజుల సడెన్ గా ఒక్కసారి మళ్ళీ వెలుగులోకి వచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమె కొన్ని వ్యాఖ్యలు చేసారు. ‘నిర్భయ' వంటి ఘటనలు విన్నప్పుడు చాలా డిస్ట్రబ్‌ చేస్తాయి. మహిళగానే కాదు... మానవత్వపు దృష్టితో చూసినా చాలా విచారకరమైన ఘటన.

ఆ ప్రాణం ఎంత విలవిలలాడి ఉంటుంది

ఆ ప్రాణం ఎంత విలవిలలాడి ఉంటుంది

ఓ మనిషి అంత క్రూరంగా ఎలా చేస్తాడు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది ఆ ప్రాణం ఎంత విలవిలలాడి ఉంటుంది రక్త-మాంసాలతో పుట్టిన సాటి మనిషిగా ఆ బాధను గ్రహించలేరా ఒకప్పుడు మంచి మనుషులు ఉండేవారు. రాముడు తదితరుల గురించి చెబుతారు కదా! మళ్లీ ఆ రోజులు రావాలి.

శిక్షలు కూడా మార్చలేవు

శిక్షలు కూడా మార్చలేవు

కఠినమైన శిక్షలు వేయాలి లాంటివి చెప్పను. శిక్షలు కూడా మార్చలేవు. ‘మంచితనం' పెంచుకోవాలి. అందుకే, ‘మూర్ఖత్వపు మనుషులు మాకు వద్దు. వాళ్ల నుంచి మమ్మల్ని బయటకు తీసుకురా. మనుషుల్లో మంచిని మాత్రమే ఉంచు. నీచపు స్థితికి దిగజారనివ్వకుండా ఉన్నత స్థితికి తీసుకువెళ్లు' అని మనందరం దేవుణ్ణి ప్రార్థించాలి.

మంచోళ్లం అయిపోవాలి

మంచోళ్లం అయిపోవాలి

మనందరం మంచోళ్లం అయిపోవాలి. అదొక్కటే మార్గం. మనం మారి, ప్రేమతో సమాజంలో మార్పు తీసుకురావాలి. ప్రేమను పంచాలి అని వేదన వ్యక్తం చేశారు మంజుల. మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువ అనే అంశం జోలికి వెళ్లదలచుకోలేదు. అలాంటి వాదన నాకిష్టం ఉండదు.

పుడతారు

పుడతారు

‘ఎంతో పుణ్యం చేస్తే మహిళగా పుడతారు' అని దలైలామా, ఓషో వంటి ఆధ్యాత్మిక గురువులు అన్నారు. ఉద్వేగం, సున్నితత్వం, ఆవేశం, జాగ్రత్త.. వంటివన్నీ మహిళలకు ఎక్కువ. మగవాళ్లు కూడా మహిళల నుంచే పుడతారు. అది సహజమైన ప్రక్రియ. మహిళగా పుట్టినందుకు ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపపడింది లేదు అని స్పష్టం చేశారామె.

English summary
manjula Gattamaneni Who is a doughter of a Superstar and sister of anether Super star is Shared Her feelings about Women discrimination on women's Day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu