»   » ఈ సదుపాయాన్ని అందరూ వినిమోగించుకోండి : బాలకృష్ణ

ఈ సదుపాయాన్ని అందరూ వినిమోగించుకోండి : బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ వాళ్శ అమ్మ గారి పేరు మీద స్దాపించినటువంటి నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా వ్యవహారిస్తున్న విషయం అందరికి తెలిసిందే. బాలయ్య బాబు చైర్మన్ అయిన తర్వాత రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా 16 లక్షల పెట్టి సైటోజెనిక్ అనే ఎక్విప్ మెంట్ ను తెప్పించడం జరిగిందన్నారు. మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఈ అత్యాధునిక పరికరం గల ఏకైక హాస్పిటల్ ఇదోక్కటేనని ఆయన వివరించారు. ఈ ఎక్విప్ మెంట్ వల్ల ఈ హాస్పిటల్ కు మంచి పేరు రావడమే కాకుండా, ఇక్కడ ఉన్న రోగులు వేరే ఏ హాస్పటల్ కు వెళ్శకుండా ఇక్కడే పరీక్షలు నిర్వహించుకోవచ్చుని ఆయన తెలిపారు. దీనితోపాటు సికింద్రాబాద్ నుండి నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వరకు తన సోంత ఖర్చులతో ఒక స్పెషల్ బస్సు వేయడం జరిగిందన్నారు. ఈ బస్సును నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసేటటువండి సిబ్బంది మరియు రోగులు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కూడా రోగులకు ఉచిత ఆరోగ్యసేవలు అందిస్తారని అన్నారు. ఇలా సేవలు అందించడం వల్ల, ప్రజలకు బాగా దగ్గర అవ్వవచ్చని బాలయ్య బాబు కు ఆయన శ్రేయేభిలాసులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య బాబు దాసరి దర్శకత్వంలో పరమవీరచక్ర సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ కొత్త సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu