»   » 200 సార్లు ఈ కథ చదివి తీస్తున్నా..ఇవివి

200 సార్లు ఈ కథ చదివి తీస్తున్నా..ఇవివి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సినిమాకి దాదాపు 18 వెర్షన్స్‌ రాసాం. దాదాపు 200 సార్లు ఈ కథ చదువుకుని ఉంటాను. చదివిన ప్రతిసారీ నవ్వుకున్నాను అంటున్నారు ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ. ఆయన తాజాగా తన కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా 'బురిడి'. 'తెగ నవ్వించేత్తాడు' అనే చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల బ్యాంకాక్ ‌లో జరిగింది. ఈ విశేషాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఈవీవీ మాట్లాడుతూ...పై విషయాలను ప్రస్దావించారు. అలాగే ఎడిటర్‌ గౌతంరాజు సాధారణంగా నవ్వడం జరగదనీ, ఈ సినిమా ఎడిటింగ్‌ చేస్తున్నప్పుడు ఆయన ప్రతి సన్నివేశానికి నవ్వారనీ, దాంతో వంద శాతం ఈ చిత్రం విజయం సాధిస్తుందని అనిపించిందనీ చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్ర ప్రేక్షకులు తనకో అదృష్టాన్ని, వరాన్ని ఇచ్చారనీ, 'అప్పుల అప్పారావు' నుంచి 'బెండు అప్పారావు' వరకూ తాను తీసిన కామెడీ చిత్రాలను వాళ్లు సూపర్‌ హిట్‌ చేసారనీ అన్నారు. అందుకే కామెడీ సినిమా చేసిన ప్రతిసారి చాలా శ్రద్ధ తీసుకుని బాగా నవ్వించడానికి తగిన కృషి చేశానని తెలిపారు. కోటి మంచి మ్యూజిక్‌ ఇస్తున్న ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేసి, వేసవి కానుకగా సినిమాని విడుదల చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu