»   »  స్టిల్‌ఫొటోగ్రాఫర్ ఈవీవీ గిరి కన్నుమూత

స్టిల్‌ఫొటోగ్రాఫర్ ఈవీవీ గిరి కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu
EVV GIRI Passes Away!
హైదరాబాద్ : ప్రముఖ స్టిల్‌ఫొటోగ్రాఫర్‌, ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి (50) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన వూపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. గురువారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని దొమ్మేరులో జన్మించిన ఈవీవీ గిరి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇష్టం ఏర్పరచుకొన్నారు. సోదరుడు ఈవీవీ సత్యనారాయణతో కలసి జంధ్యాల దర్శకత్వంలో కొన్ని చిత్రాలకు పనిచేశారు. ఓ వైపు ఈవీవీ సహాయ దర్శకుడిగా రాణిస్తుంటే, అవే సినిమాలకు జంధ్యాల దగ్గర స్టిల్‌ఫొటోగ్రాఫర్‌గా బాద్యతలు నిర్వహించారు గిరి.

'భార్యాభర్తలు', 'చంటబ్బాయ్‌', 'జయమ్ము నిశ్చయమ్మురా' ఇలా జంధ్యాలతో ఆయన ప్రయాణం కొనసాగింది. ఈవీవీ దర్శకుడిగా మారిన తరవాత దాదాపు ప్రతీ సినిమాకీ గిరి స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా సేవలు అందించారు. మొత్తమ్మీద దాదాపు 80 చిత్రాలకు పనిచేశారు. గిరి మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. వన్ ఇండియా తెలుగు ...ఇవివి గిరికి నివాళులు అర్పిస్తోంది.

English summary
EVV Giri, cinematographer for many Telugu films in 90′s has passed away 21st Jan . Giri is the brother of renowned Telugu film director EVV Satyanarayana. Evv Giri is currently working as a still photographer and his passion for films is always talked about.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu