»   » ఇవివి సత్యనారాయణ 'బురిడి' చిత్రం కధేంటి?

ఇవివి సత్యనారాయణ 'బురిడి' చిత్రం కధేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ దర్శకుడు ఇవివి తన కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా అందరి కమిడెయన్స్ తో కలిపి చేస్తున్న కామిడీ చిత్రం 'బురిడి'. ఈ చిత్రం కథ పదమూడు విచిత్రమైన జంటల చుట్టూ తిరిగుతుంది. వాళ్లెలా భార్యభర్తలయ్యారు, హనీమూన్‌కి ఒకే ఏరియాలో, ఒకే హోటల్ ‌కి ఎలా వచ్చారు, వాళ్లలో ఒకమ్మాయిని చంపడానికి వచ్చి, చంపాలనుకునే క్రమంలో ఇద్దరు డాన్‌ లు ఎలాంటి పాట్లు పడ్డారు, ఆ అమ్మాయిని వాళ్లు చంపారా, ఆమెని చంపించాలనుకున్నది ఎవరు..అనే అంశాలుతో తమాషాగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇవివి గత చిత్రం ఎవడి గోల వాడిదే తరహా కథే అయినా గమ్మత్తుగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే సందేశాలు, సమస్యలు, కన్నీళ్లు, రక్తపాతాలు లేని సినిమా అని అంతా నవ్వే నవ్వు అని ఇవివి హామీ ఇస్తున్నారు.

ఇక ఈ చిత్రం గురించి ఇవివి మాట్లాడుతూ..'బురిడి'తో కలిపి ఇరవై నాలుగు కామెడీలు తీశా. 'అప్పుల అప్పారావు' నుంచి 'బెండు అప్పారావు' దాకా నా కామెడీ సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే వొస్తున్నారు. జనార్దన మహర్షి ఆధ్వర్యంలో మరో నలుగురు రచయితలు కలిసి ఈ స్క్రిప్టు తయారుచేశారు. ప్రతి సీనులోనూ కామెడీ వొచ్చేట్లు జాగ్రత్తపడ్డాం. మూడు డ్యూయెట్లలో తప్ప మొత్తం సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు ప్రేక్షకులు. క్లైమాక్స్ ముందు పదకొండు నిమిషాల పాటు నడిచే పాట ఉంది. ఇరవై ఆరుమంది ఆర్టిస్టుల మీద హిందీ బాణీలకు తెలుగులో పేరడీలు రాయించి ఈ పాట తీశాం. ఇది బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పారు. అలాగే ఈ చిత్రం ఇవివికి 50వ చిత్రం. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X