»   » 'సిల్లీ ఫెలో' కు మళ్ళీ క్రేజ్ వచ్చింది

'సిల్లీ ఫెలో' కు మళ్ళీ క్రేజ్ వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు సందర్భంగా పాపులర్ అయిన పదం 'సిల్లీ ఫెలో'. అప్పుడు జరిగిన గొడవలో మోహన్ బాబు 'సిల్లీ ఫెలో' అని నిర్మాత కె.యస్. రామారావు ని అన్నారు. సిల్లీ ఫెలో అంటే యేమీ తెలియని వాడని అర్ధం. ఇప్పుడది మళ్ళీ వినపించబోతోంది. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఆయన కుమారుడు అల్లరి నరేష్ హీరోగా రూపొందనున్న చిత్రానికి టైటిల్ గా 'సిల్లీ ఫెలో' అని పెట్టనున్నారని సమాచారం. బురిడి చిత్రం నిర్మించిన ప్రొడ్యూసర్స్ ఈ 'సిల్లీ ఫెలో' ని నిర్మిస్తున్నారు. ఇక ఈ టైటిల్ బయిటకు రాగానే అంతటా ఓ చిన్న నవ్వు...వజ్రోత్సవాల నాటి సంఘటన మదిలో మెరుస్తున్నాయి. అంటే ఇవివి తన టైటిల్ తో మళ్ళీ ఆకట్టుకున్నట్లే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu