»   » ‘సరైనోడు’ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసా?

‘సరైనోడు’ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, కేథ‌రిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం స‌రైనోడు. అల్లు అర‌వింద్ నిర్మాత‌. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై రూపొందిన ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ రోజు 'సరైనోడు' చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. అభిమానులు, ప్రేక్షకులను నుండి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ సినిమాలో లుక్ పరంగా చాలా కొత్తగా కనిపించాడని అంటున్నారు. డ్యాన్సులు, ఫైట్స్ తన ఎనర్జి లెవల్స్ కు తగిన విధంగా బన్నీ అదరగొట్టాడని టాక్. బన్నీ ఆల్రెడీ మాస్ హీరో....అయితే ఈ సినిమాతో తన మాస్ ఇమేజ్ లెవల్ మరింత పెరుగుతందని అంటున్నారు.

కథ పరంగా చూస్తే కొత్తగా ఏమీ లేదని టాక్. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ పై పెట్టిన అటెన్షన్ మెయిన్ కథపై పెట్టినట్లు కనపడలేదు. భ్రద తరహా యాక్షన్ మూవీలా ఉందంటున్నారు. సెకండాఫ్ కథను ముందే ప్రేక్షకుడు ఊహించేవిధంగా ఉందట.

థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమా హైలెట్ అయ్యాయట. బన్ని, మెగా అభిమానులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మాస్ ఎంటర్టెనర్ అని, సూపర్ గా ఉందని కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం ఫర్వాలేదని అంటున్నారు. సినిమాపై ఆడియన్స్ రెస్పాన్స్‌కు సంబంధించిన వీడియో స్లైడ్ షోలో ఎక్స్‌క్లూజివ్ గా మీ కోసం..

మరో వైపు ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు సినీ తారలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. సరైనోడు చిత్రం బాక్సాఫీసును షేక్ చేయాలని రానా తన ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా సరైనోడు టీంకు విషెస్ తెలిపారు.

ఆడియన్స్ రెస్పాన్స్: పై వీడియోపై క్లిక్ చేయండి

సినిమా మాస్ ఎంటర్టెనర్ అని, సూపర్ గా ఉందని కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం ఫర్వాలేదని అంటున్నారు.

రానా ట్వీట్

సరైనోడు టీమ్ ను విష్ చేస్తూ రానా ట్వీట్.

మిస్ అయ్యాను

సరైనోడు చిత్రాన్ని మిస్ అయ్యాను అంటూ రానా ట్వీట్

వరుణ్ తేజ్ ట్వీట్

సరైనోడు టీంకు బెస్టాఫ్ లక్ చెబుతూ వరుణ్ తేజ్ ట్వీట్.

నటీనటులు అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో) నటించారు.

సాంకేతిక వర్గం
బ్యానర్ - గీతా ఆర్ట్స్
ప్రొడక్షన్ కంట్రోలర్స్ - బాబు, యోగానంద్
చీఫ్ కోఆర్డినేటర్ - కుర్రా రంగారావ్
ఆర్ట్ డైరెక్టర్ - సాయి సురేష్
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్, రవి వర్మ
డిఓపి - రిషి పంజాబి
డైలాగ్స్ - ఎం.రత్నం
మ్యూజిక్ - ఎస్ ఎస్ తమన్
కో ప్రొడ్యూసర్ - శానం నాగ అశోక్ కుమార్
ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్
డైరెక్టర్ - బోయపాటి శ్రీను.

English summary
Exclusive video of Sarrainodu First Day Audience Response.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu