»   » ఆస్కార్‌కు నామినేట్ అయిన తెలుగుసినిమా , బంగారు నంది వస్తుందనుకున్నాం

ఆస్కార్‌కు నామినేట్ అయిన తెలుగుసినిమా , బంగారు నంది వస్తుందనుకున్నాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన సినిమా మిణుగురులు కు బంగారు నంది వస్తుందనుకున్నాను కానీ రెండో స్థానం లో తన సినిమా నిలబడిందని,. అయితే ఈ విషయం లో తాను ఎవరినీ విమర్షించేది లేదనీ తమ సినిమాకు దక్కిన స్థానం తో ఎంతో సంతోషంగా కూడా ఉన్నాననీ చెప్పారు అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి . మా అమ్మ టీవీ చూస్తూ మా 'మిణుగురులు'కు నంది అవార్డు వచ్చిందని చెప్పారు. నేను 'బంగారు నంది'ని ఆశించాను. కానీ రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు. మొత్తం ఏడు విభాగాల్లో మా చిత్రాన్ని నందులు వరిస్తున్నాయి. 40 మంది కంటిచూపు లేని చిన్నారులతో దాదాపు రెండున్నరేళ్లు కష్టడి తీసిన చిత్రమిది. మనవారితో పాటు హాలీవుడ్‌, ముంబై సాంకేతిక నిపుణులు కూడా పనిచేశారు. 2014లో ఆస్కార్‌ రేసులో నిలిచింది. ఈ స్క్రిప్ట్ ఇప్పటికీ ఆస్కార్‌ లైబ్రరీలో ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు అందుకున్నాం. దాసరినారాయణరావుగారు తొలి సారి బయట చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన ఘనత మా 'మిణుగురులు'కు దక్కింది. చిరంజీవిగారు ప్రశంసించిన క్షణాలను మర్చిపోలేను. ఈ సినిమా కోసం నేను పడ్డ కష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం చక్కటి ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో ఉన్నాను'' అంటూ చెప్పాడు.ఆస్కార్ కు కూడా నామినేట్ అయిన ఈ తెలుగు సినిమాలో ఇంతగా చెప్పుకునేందుకు ఏముందీ అంటే


మిణుగురులు:

మిణుగురులు:

తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు.. తక్కువే...అంత డబ్బు ఖర్చు పెట్టి వెనక్కి వస్తాయో లేదో తెలియని చిత్రాలు చేయటమెందుకని ధైర్యం చేయరు. అయితే అక్కడక్కడా మిణుకుమంటున్నట్లుగా మేం ఉన్నాం అంటూ "మిణుగురులు" లాంటి చిత్రాలు వస్తున్నాయి.


ప్రయోగాత్మక సినిమా:

ప్రయోగాత్మక సినిమా:

కమర్షియల్ కోణంలో కాకుండా ఓ మంచి చిత్రంగా,ఆలోచనలు రేపే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం చూడదగినదే..అభినందించదగినదే. ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్టు ఎన్నుకున్న దర్శకుడు,రాసిన రచయిత,నటించిన పిల్లలు అంతా ధైర్యవంతులే...తెలుగు ప్రయోగాత్మక సినిమాకు మిణుగురులే.


చూపు కోల్పోతాడు:

చూపు కోల్పోతాడు:

కథాపరంగా... రాజు అనే ఓ అబ్బాయి చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా దర్శకుడు కావాలన్న అతని కోరిక మొగ్గలోనే వాడిపోతుంది. అప్పటికే ఓ టైలర్‌ షాప్‌కు యాడ్‌ ఫిలిం తీసిన అనుభవం అతనికి ఉంది. అనుకోకుండా జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో అతని చూపు కోల్పోతాడు. అప్పటి నుంచి అతనికి కష్టాలు ప్రారంభమవుతాయి.


అంథ పాఠశాలలో:

అంథ పాఠశాలలో:

తండ్రి రాజును తీసుకువెళ్ళి అంథ పాఠశాలలో చేర్చుతాడు. ఆ పాఠశాలలో అన్ని అధికారాలూ చలాయించేది నారాయణ అతని కనుసన్నల్లోనే అంధ పాఠశాలలో చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది. విద్యార్థులకు సరిగా భోజనాలు పెట్టకుండా దుప్పట్లు ఇవ్వకుండా, చండశాసనుడిలా నారాయణ వ్యవహరిస్తుంటాడు.


ఒక్కపూట భోజనమే:

ఒక్కపూట భోజనమే:

పాఠశాలలో పనిచేసే ఆయమ్మ అతని వల్లో పడి అమ్మగారుగా మారిపోతుంది. నారాయణకు జూదం తీవ్రమైన వ్యసనం. పాఠశాలకు లభించే గ్రాంట్లు అంతా జూదంలో పోగొట్టుకుంటాడు. అప్పటినుంచి పిల్లలకు ఒక్కపూట భోజనమే పెడుతుంటాడు.


లంచం తీసుకుని :

లంచం తీసుకుని :

ఎదురుతిరిగిన పెద్ద పిల్లలను శిక్షిస్తుంటాడు. అతని ఆగడాలన్నీ ఓ లెటర్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌కి తెలియజేస్తారు విద్యార్థులు. దానిపై ఓ ఎంక్వెయిరీ కమిటీ వేస్తుంది కలెక్టర్‌. విచారణాధికారి వచ్చి లంచం తీసుకుని అంతా సజావుగా ఉందని రిపోర్ట్‌ ఇస్తాడు.


కెమెరానుతమ కన్నుగా:

కెమెరానుతమ కన్నుగా:

మళ్ళీ విద్యార్థుల ఆశలు నీరుగారిపోతాయి. ఇక లాభం లేదని ఓ కెమెరాను తీసుకువచ్చి అదే తమ కన్నుగా భావించి... పాఠశాల, వసతి గృహంలో జరుగుతున్న ఆగడాలు, అకృత్యాలు, బాధలు చిత్రీకరించి కలెక్టర్‌కు చేరవేయడానికి రాజు ఏం చేశాడనేదే ముగింపు.


కమర్షియల్ సినిమా:

కమర్షియల్ సినిమా:

విన్నూత్నంగా చేసిన ప్రయోజనాత్మక ప్రయోగం ఇది. అంధవిధ్యార్థులు అనగానే ఇదేదో ఆర్టు ఫిల్మ్ తరహా సినిమా అనుకుంటే పొరబాటే. సినిమా కథనంలోని మలుపులు, ఎడిటింగ్ లోని వేగం, నటీనటుల సహజనటన కలిసి ఒక కమర్షియల్ సినిమా గ్రామర్ని ఆర్టు సినిమా విషయానికి అధ్ధినట్టు ఉండే చిత్రం ఇది.


English summary
Telugu film 'Minugurulu' on blind students fighting for justice Director Ayodhya Kumar says "Expected Gold Nandi for my Movie"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu