»   » క్లీన్ యు: శర్వానంద్ సినిమా చూసి థ్రిల్ అయిన సెన్సార్ సభ్యులు

క్లీన్ యు: శర్వానంద్ సినిమా చూసి థ్రిల్ అయిన సెన్సార్ సభ్యులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో శ‌ర్వానంద్‌ హీరోగా, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ బంపర్ హిట్‌ అనంతరం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సుర‌భి క‌థ‌నాయిక‌గా రూపొందుతున్న చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా.

మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల అనంతరం క్లీన్ ఎంటర్ టైనర్స్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ చిత్రం సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. చిత్రాన్ని చూసిన సెన్సారు స‌భ్యులు చిత్రంలో వ‌చ్చే థ్రిల్స్‌ని ఎంజాయ్ చేస్తూ చూడ‌టం విశేషం. ప‌క్కా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రంగా సెన్సారు స‌భ్యులు కితాబిచ్చారు. ఈ చిత్రానికి క్లీన్ యు స‌ర్టిఫికెట్‌ని ఇచ్చారు.


Express Raja censored with 'U' certificate

ఇప్ప‌టికే ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. జ‌న‌వ‌రి 14వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. మా బ్యాన‌ర్‌లో గతంలో శ‌ర్వానంద్ హీరోగా రన్ రాజా రన్ వంటిసూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిందన్నారు. ఇదే హిట్ కాంబినేష‌న్‌లో మరోసారి ఎక్స్‌ప్రెస్ రాజా వస్తోందన్నారు.


ఈ చిత్రం సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ సినిమా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుందని చెప్పారు. ఈ సినిమాను సెన్సార్ సభ్యులు థ్రిల్‌గా ఫీలయ్యారని, ఇందుకు ఆనందంగా ఉందన్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి సూప‌ర్‌ డూపర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారన్నారు.


Express Raja censored with 'U' certificate

మరోసారి హిలేరియస్ ఎంటర్ టైనర్ అందించారన్నారు. హీరోయిన్ సురభి, శర్వానంద్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందన్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 14న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. తమ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన నాలుగు చిత్రాలు ఎలా విజయం సాధించాయో ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రం కూడా అంతకు మించి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.


నటీనటులు: శ‌ర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణ మురళి, సూర్య, నాగినీడు, బ్రహ్మాజీ, సుప్రీత్, సప్తగిరి, షకలక శంక‌ర్‌, ధనరాజ్ త‌దిత‌రులు.
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ ఎన్
ఎడిటర్ - సత్య జి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్ రవిందర్
లిరిక్స్: భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో
డ్యాన్స్: రాజు సుందరం, విశ్వ, రఘు
చీఫ్ కాస్ట్యూమ్ డిజైనర్: తోట విజయ్ భాస్కర్
ఫైట్స్: స్టంట్ జాషువా
ప్రొడక్షన్ కంట్రోలర్స్: ఎమ్ కృష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్
పిఆర్ఓ: ఎస్కెఎన్, ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్: వర్కింగ్ టైటిల్ (శివ కిరణ్)
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.

English summary
Express Raja censored with 'U' certificate; Sharwanand-Surabhi starrer set for grand release on 14 January.
Please Wait while comments are loading...