For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరే సెట్ లో... అల్లు అర్జున్ పెళ్లి హంగామా

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

  ఇక ఈ చిత్రానికి 'హూషారు' అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు త్రిశూలం అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండింటిలో ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.

  రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఫైట్స్, డాన్స్ విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వినోదంతో పాటు హద్యమైన భావోద్వేగాలు మేళవించిన కథాంశమిదని చిత్ర బందం చెబుతోంది.

  'జులాయి'తో విజయం సాధించిన ఈ జంట ఇప్పుడు మరోసారి వినోదాలు పంచబోతోంది. రాధాకృష్ణ నిర్మాత. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  Extravagant set for Allu Arjun-Trivikram film

  మరో ప్రక్క మిర్చి ఫేం కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా ఓకే అయినట్లు ఇంతకు ముందు వార్త వచ్చింది. మహేష్‌బాబు సినిమాను శివ మే1 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా...మరోవైపు త్రివిక్రమ్‌ బన్నీల సినిమాకూడా విడుదలకు సిద్ధమవుతుంది. అంటే వీరి సినిమా తొందర్లనే పట్టాలెక్కబోతుందని అంటున్నారు. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది తేలియాలి.

  అయితే శేఖర్ కమ్ముల వంటి ఫీల్ గుడ్ చిత్రాలు తీసే దర్శకుడుతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తాడా, లేక యాక్షన్ ,లవ్ స్టోరీతో ముందుకు వెళ్తున్న కొరటాల శివతో ముందుకు వెళ్తాడా అనేది ఇప్పుడు అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది. అలాంటిదేమీ లేదు...ఇది కేవలం రూమరే అని కొందరు బన్ని అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఈ విషయమై బన్ని కానీ శేఖర్ కమ్ముల కానీ మాట్లాడితే కానీ ఈ చర్చ ఆగేటట్లు లేదు.

  ఆనంద్‌, హ్యాపీడేస్‌, లీడర్‌, లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌'....వంటి ఫీల్‌ గుడ్‌ సినిమాలు తీసే శేఖర్‌కమ్ముల...ఎప్పుడూ కమర్షియల్‌ సినిమాలు తీయలేదు. అయితే రీసెంట్ గా ప్రకారం శేఖర్‌ కమ్ముల, అల్లు అర్జున్‌కి కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కథ బన్నీకి కూడా నచ్చడంతో పూర్తి స్ర్కిప్ట్‌ శేఖర్‌కమ్ములను సిద్ధం చేసుకోమన్నాడని సమాచారం. అయితే ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల కూడా ఈ ఏడాది ‘హ్యాపీడేస్‌' చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

  ‘హ్యాపీడేస్‌' రీమేక్‌ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌ నిర్మించబోతున్నాడని సమాచారం. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా తీసే ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శేఖర్‌ కమ్ముల కూడా కమర్షియల్‌ సినిమాలు తీయగలడని నిరూపించుకోవడానికి ఇదో అవకాశంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ మంచి మాస్ హీరో. ఇప్పటివరకు తను చేసిన తరహా మాస్ చిత్రాలను శేఖర్ కమ్ముల తీయలేదు. మరి.. బన్నీ తరహాలో మాస్ చిత్రం చేస్తారా? లేక తనదైన శైలిలో బన్నీని వేరే విధంగా ఆవిష్కరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

  English summary
  Allu Arjun,Samantha, Adah Sharma, Nitya Menojn's film under Trivikram Srinivas is readying for his new schedule from Jan 20th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X