Don't Miss!
- News
ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ - "చేదోడు" అక్కడి నుంచే..!!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
హిందీలోనూ అదరగొడుతున్న ‘F2’.. రెండు రోజులకే భారీ స్థాయిలో..
Recommended Video
సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ 'F2'. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మించిన 'F2' భారీ వసూళ్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. కుటుంబ సమేతంగా వచ్చి గ్రాండ్ సక్సెస్‌ను అందించారు. 2019లో మహేశ్ బాబు 'మహర్షి' తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం.

అమెజాన్ ప్రైమ్‌లోనూ సక్సెస్
‘F2' వెండితెరపైనే కాదు.. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోనూ సూపర్ సక్సెస్ అయింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా విడుదలైన యాభై రోజులకు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. దీంతో అక్కడా మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమాను పెట్టిన తక్కువ వ్యవధిలోనే భారీ క్లిక్స్‌ను రాబట్టింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు గతంలోనే వెల్లడించారు.

తాజాగా హిందీలోకి...
అటు వెండితెరపై.. ఇటు డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై ఘన విజయాన్ని అందుకున్న ‘F2'.. తాజాగా హిందీలోకి డబ్బింగ్ అయింది. తెలుగు సినిమాలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్ ఉండడంతో, ఈ సినిమాను అదే పేరుతో ఆదిత్య మూవీస్ చానెల్ ద్వారా విడుదల చేశారు.

రికార్డు వ్యూస్
ఈ సినిమా యూట్యూబ్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే 18.7 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే, దాదాపు రెండున్నర లక్షల లైకులు అందుకుంది. అంతేకాదు, ఈ సినిమా యూట్యూబ్‌లో ట్రెండ్ అవడంతో పాటు గంట గంటకూ వ్యూస్‌ను పెంచుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు చిత్రాలకు హిందీలో బాగా డిమాండ్ ఉంది అనడానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇటీవలే రామ్ సినిమా కూడా
కొద్దిరోజుల క్రితం ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘హలో గురూ ప్రేమ కోసమే'ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆదిత్యా మూవీస్ దీన్ని హిందీలోకి మార్చి ‘‘దుండార్ కిలాడీ '' పేరుతో రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.