»   » రామ్ చరణ్ లైవ్ ఛాట్ ఈ రోజే, డిటేల్స్

రామ్ చరణ్ లైవ్ ఛాట్ ఈ రోజే, డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ త‌న ఫేస్ బుక్ ఎక్కౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో మ‌రికొద్దిసేప‌ట్లో ముచ్చటించ‌నున్నాడు. తన అభిమానులతో ఫేస్ బుక్ అకౌంటు ( ద్వారా లైవ్ ఛాట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మీరు చరణ్ అభిమానులై... ఆల్రెడీ ఫేస్ బుక్ ఫాలోవ‌ర్స్ గా ఉంటే ప్రశ్నలు రెడీ చేసుకోండి మరి, చరణ్ ఆన్సర్ చేస్తానంటున్నాడు.

రామ్ చరణ్ కు ...సుమారు 35 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక చరణ్ ఫేస్‌‍బుక్‌లో అభిమానులంతా ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించటం మొదలెట్టారు. దీంతో పాటు డబ్స్‌మ్యాష్‌తో మెప్పించిన వారికి నేరుగా తనను సెట్లో కలిసే అవకాశాన్ని కూడా రామ్ చరణ్ కల్పించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక 'ధృవ' సినిమా విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Face book live: Ram Charan chat with with his fans

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మధ్యనే గోల్కొండ పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ పై ఇంట్రడక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ ను అనుకున్న టైమ్ కి పూర్తిచేయడానికి చిత్ర యూనిట్ శరవేగంగా పనిచేస్తోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ 'తనీ ఒరువన్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన 'రకుల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తుండగా 'అరవింద స్వామి' విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

English summary
Ram Charan start a chat session with his fans through Facebook live, today at 5 pm. The actor will be taking questions and responding to them through his official FB page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu