»   » హీరోయిన్ మిస్సయింది, ఇపుడు ఆమె భర్తతో జూ ఎన్టీఆర్?

హీరోయిన్ మిస్సయింది, ఇపుడు ఆమె భర్తతో జూ ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నజ్రియా నజీమ్....గురించి మీకు పరిచయం ఉండే ఉంటుంది. అమ్మడు తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించక పోయినా, అప్పట్లో ఓ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం దక్కలేదు.

అప్పుడు ఎన్టీఆర్ తో ఆ హీరోయిన్ మిస్సయింది. కానీ ఇపుడు ఆమె భర్త ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ అనే చిత్రం రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే.

Fahad Fazil to star in NTR's next

ఇప్పటికే ఎన్టీఆర్ తండ్రిగా మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ని ఎంపిక చేశార‌ు. ఈ సినిమాలో మ‌రో ముఖ్య‌మైన పాత్ర కోసం మ‌ల‌యాళ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ ని తీసుకోనున్నార‌ని స‌మాచారం అందుతోంది. పహాద్ ఫాజిల్ ఎవరో కాదు... నజ్రియా భర్తే. ఈ మధ్య కాలంలోనే వీరి వివాహం జరిగింది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ. ఎగ్జిక్యూటివ్ నిర్మాత- చంద్రశేఖర్ రావిపాటి, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.

English summary
Director Koratala Shiva is leaving no stone unturned to make his upcoming movie Janatha Garage a grand spectacle. Malayalam actor Fahad Fazil has been approached by Shiva to play a crucial role in this action entertainer.
Please Wait while comments are loading...