twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వై దిస్ కొలవెరి డీ..? : సినీ నటులని ఎందుకిలా చంపేస్తున్నారు?

    |

    సోషల్ మీడియా సమాచార రంగం లో ఒక విప్లవాన్నే తీసుకు వచ్చింది. కొన్ని ఉధ్యమాలకు వేదికగా నిలిచింది. ఒక దశలో ప్రభుత్వాలనే గదగడలాడించింది. కానీ ఆయుధమైనా వాడుకోవటాన్ని బట్టే ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అలా పిచ్చివాడి చేతిలో రాయిలా మారిందా? ఎవరి మీద కోపం వచ్చినా తమతమ ఎకౌంట్లలో ఆయా మనుషులని "చంపేస్తున్నారు".

    మంగళవారం ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలతో. పలువురు దిగ్బ్రాంతి చెందారు. ఆయన చనిపోయినట్టు జరుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి. నేను బతికే ఉన్నాను అంటూ కాస్త అసహనంగానే తన ఆవేదనని వెలిబుచ్చారు వేణూ.

    అయితే ఇదే మొదటిసారి కాదు మొన్నటికి మొన్న తమిళ కమేడియన్ సెంథిల్ విషయం లోనూ ఇలాగే జరిగింది. నిక్షేపంగా ఉన్న ఆయన్ని అనవసరంగా చంపేసారు ఎవరో ఆకతాయిలు. దాంతో స్వయంగా ఆయనే మీడియా ముందుకొచ్చి తాను బతికే ఉన్నానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

    గతంలో ఎమ్మెస్ నారాయణ విషయంలోనూ ఇలాంటి అత్యుత్సాహమే కనిపించింది. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూండగానే మరణించారంటూ. వార్తలు ప్రచారం అయ్యాయి. ముందే ఆ న్యూస్ మేమే వేయాలనే ఉత్సాహంలో ఆయన చనిపోయే ఒక రోజు ముందే మీడియా ఆయన్ని చంపేసింది. తమిళ సీనియర్ నటి మనోరమను అయితే బతికుండగానే రెండుసార్లు చంపేసారు కొందరు అత్యుత్యాహ వంతులు.

    fake death news on social media became a ugly trend

    కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బాద్షా అమితాబ్ నూ ఇలాగే చంపేసారు ఈ ఫేకు వీరులు. చిన్న అనారోగ్యం తో ఆసుపత్రిలో చేరిన ఆయనని ఏకంగా క్యాన్సర్ తో చనిపోయారంటూ ప్రచారం చేసారు. ఈ న్యూస్ బాలీ వుడ్ ని కొన్ని గంటల పాటు ఊపేసింది. అమితాబ్ ఆలస్యం చేయకుండా స్పందించటం తో ఆయన బతికే ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారంతా

    తమ వెబ్సైట్లకు రావాల్సిన హిట్ లకోసం, లైకులకోసం ఇలా వార్తలని ప్రచురిస్తూంటే. మరికొందరు ఆకతాయితనం తోనూ, తమకున్న వ్యక్తి గత ద్వేషం తోనూ "RIP" అంటూ పోస్ట్ పెట్టి ఇలా తప్పుడు మరణ వార్తలని ప్రచారం చేస్తున్నారు. ఇది ఇవాల కొత్త కాదు ఇదివరలో హాలీవుడ్ నటులు ఆర్నాల్డ్ ష్వాట్జ్ నెగ్గర్, జాకీచాన్ విషయంలోనూ డెత్ రూమర్లు వచ్చాయి. వీళ్లు యాక్షన్ హీరోలు కావడంతో అభిమానులు కూడా ఇది నిజమని నమ్మారు.

    కోపమొస్తే ఎవరైనా తిడతారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా అని కామెడీగా ఫోటోలకు దండేస్తున్నారు. పవన్ ని తిట్టాడనే కోపంతో ఆ మధ్య రాం గోపాల్ వర్మనూ ఇలా "మీడియా లో" వర్మను చంపేసారు పవన్ అభిమానులు.దర్శక రత్న దాసరికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది.

    చేతిలో కీబోర్డు ఉందికదా అని ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారి వికృత చేష్టలు చాలామందికి చికాకు తెప్పిస్తున్నాయి. టెక్నాలజీ ని వాడుకోవటం మంచికోసమైతే బాగానే ఉండేది కానీ ఇలా తమ కోపం తీర్చుకోవటం కోస దుర్వినియోగం చేయతమే విచారకరం....

    English summary
    social media users spreading fake news on celebrity's death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X