»   » శ్రీకాంత్‌పై యాక్సిడెంట్ రూమర్స్ సృష్టించారు..కేసు పెట్టి బాగా బుద్ది చెప్పాడుగా!

శ్రీకాంత్‌పై యాక్సిడెంట్ రూమర్స్ సృష్టించారు..కేసు పెట్టి బాగా బుద్ది చెప్పాడుగా!

Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పుకారు రాయుళ్లకు తిమ్మిని బమ్మి చేయడం బాగా అలవాటైపోయింది. హద్దులు మీరుతున్న పుకార్లతో విసుగు తెప్పించే వార్తలని సృష్టిస్తున్నారు కొందరు. ప్రముఖ హీరో శ్రీకాంత్ యాక్సిడెంట్ కు గురైనట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తలా తోక లేనివార్తలతో విసిగిపోయిన శ్రీకాంత్ నేడు మీడియా ముందుకు వచ్చారు. తన గురించి వస్తున్న రూమర్లపై ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో వార్తలు అసత్య ప్రచారం జరుగుతుండడంతో శ్రీకాంత్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు అందించారు.

'Raa Raa' Movie Review రా..రా... సినిమా రివ్యూ
 అసత్యాలకు అడ్డా

అసత్యాలకు అడ్డా

సోషల్ మీడియా రాను రాను అసత్యాలు అడ్డాగా మారుతోందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ట్విట్టర్, పేస్ బుక్ లలో ఫేక్ న్యూస్ లు ఇబ్బడి ముబ్బడిగా దర్శనం ఇస్తూ చికాకు పుట్టిస్తున్నాయి.

శ్రీకాంత్ గురించి రెండు రోజులుగా

శ్రీకాంత్ గురించి రెండు రోజులుగా

హీరో శ్రీకాంత్ గురించి రెండురోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. శ్రీకాంత్ ప్రమాదానికి గురయ్యాడనేది ఆ వార్తల సారాంశం.పేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్ ఇలా వివిధ సామజిక మాధ్యమాలలో శ్రీకాంత్ గురించిన వార్తలు దర్శనం ఇస్తున్నాయి.

ఘాటుగా స్పందించిన శ్రీకాంత్

ఘాటుగా స్పందించిన శ్రీకాంత్

ఈ పుకార్లతో షాక్ కి గురైన శ్రీకాంత్ నేడు మీడియా ముందుకు వచ్చారు. తాను బెంగుళూరులో షూటింగ్ లో ఉన్న సమయంలో చాలా మంది స్నేహితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు ప్రమాదానికి గురయ్యారు అట కదా ఎలా ఉంది అంటూ ఆరాతీస్తున్నారు.

ఫ్యామిలీ కూడా

ఫ్యామిలీ కూడా

తన ఫ్యామిలీ కూడా కంగారు పడి ఫోన్ చేసారని శ్రీకాంత్ న్నారు. అభిమానులు కూడా నేను ఎలా ఉన్నాను అంటూ మెసేజ్ లు పెడుతున్నారు అని శ్రీకాంత్ తెలిపాడు.

 సైబర్ క్రైం కేసు

సైబర్ క్రైం కేసు

ఇలా అసత్య ప్రచారాలు చేస్తే అందరికి ఇబ్బంది అని శ్రీకాంత్ అన్నారు. లైక్స్ కోసం ఇలాంటి పోస్ట్ లు పెట్టినా, వెబ్ సైట్లు ఇలాంటి కథనాలు రాసిన చాలాపెద్ద నేరం అవుతుందని శ్రీకాంత్ వార్నింగ్ ఇచ్చారు. సైబర్ క్రైం పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేశారు.

ఇలాంటివి కొత్త కాదు

ఇలాంటివి కొత్త కాదు

సోషల్ మీడియా లో ఇలాంటి పుకార్లు రావడం ఇదేమి కొత్త కాదు. చాలా మంది సెలెబ్రిటీల విషయంలో గతంలో ఇలాంటి పుకార్లు వచ్చాయి.

ప్రభాస్ గురించి

ప్రభాస్ గురించి

బాహుబలి చిత్రీకరణ సమయంలో ప్రభాస్ ప్రమాదానికి గురయ్యాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అదంతా అసత్యం అని తేలింది.

మాజీ హీరోయిన్ లయ

మాజీ హీరోయిన్ లయ

మాజీ హీరోయిన్ లయ ప్రమాదానికి గురైందంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. దీనిపై స్వయంగా లయ క్లారిటీ ఇచ్చేవరకు కూడా ఈ పుకార్లు ఆగలేదు.

English summary
Fake news going viral regarding hero Srikanth. Srikanth files cyber crime case
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu