»   » ఎన్టీఆర్ కు ఫేక్ ఫ్లాబ్లం...రిపోర్ట్ చేయమని రిక్వెస్ట్

ఎన్టీఆర్ కు ఫేక్ ఫ్లాబ్లం...రిపోర్ట్ చేయమని రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ పెద్ద హీరో చిత్రం ప్రారంభమవుతోందంటే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దానికి సంభందించిన సంబరాలు ప్రారంభమవుతాయి. అంతేకాదు ఆ సినిమా కు చెందిన అఫీషియల్ పేజీలు నిర్మాతలు ఓపెన్ చేస్తారు. కానీ ఈ లోపు కొందరు అభిమానులు అత్యుత్సాహంతో ఆ కొత్త సినిమాకి సంభందించిన పేజీలు ప్రారంభించేస్తూంటారు.

ఇప్పుడు అలాంటి సమస్యే..ఎన్టీఆర్ కొత్త చిత్రానికి వస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్ కు సంభందించిన పేజీలు ట్విట్టర్ ,ఫేస్ బుక్ లలో విచ్చలవిడిగా ఓపెన్ చేసేస్తున్నారు. దీంతో ఈ విషయమై నిర్మాతలు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఈ ప్రకటనలో ఎన్టీఆర్ 25వ చిత్రానికి సంభందించి, ఫేక్ ఎక్కౌంట్స్ అంతటా కనిపిస్తున్నాయి. అలాంటివి కనపడితే రిపోర్ట్ చేయండి. ఇది మాత్రమే ఒకే ఒక ఎక్కౌంట్ ఈ చిత్రానికి సంభందించి అని ట్వీట్ చేసారు. కాబట్టి అలాంటి ఎక్కౌంట్స్ ఉంటే రిపోర్ట్ చేసి సహకరించండి మరి.

చిత్రం విశేషాలకు వస్తే...

ఎన్టీఆర్ హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమా జనతాగ్యారేజ్. కొరటాల శివ డారక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో నిత్యమీనన్, సమంతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Fake twitter accounts of NTR26

ఈ సినిమా షూటింగ్ ఈ నెల 10 నుండి ఆరంభం కావలసివుంది, కానీ గ్యారేజ్ కు సంబందించి సెట్టింగ్ ఇంకా పూర్తికానందున ఫిబ్రవరి 25కు ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడినట్టు సమాచారం.

మెహనలాల్ ఈ సినిమాలో మెదటి షెడ్యూల్ నుండే ఎన్టీఆర్ తో కలిసి షుటింగ్ పాల్గోనున్నాడు, ఇందులో లాల్ ది కీ రోల్ అని తెలుస్తోంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సంగీత పనులు మెదలుపెట్టినట్టు దేవీశ్రీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

English summary
Mythri Movie Makers ‏tweeted: "Fake twitter accounts of #NTR26 doing rounds! Please report if you find any such accounts! This is the only account! Thanks."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu