»   » ‘అ..ఆ’ కొత్త కాంట్రవర్శీ: పైరసీ, అరెస్ట్ లేదు, ఎందుకింత అబద్దం?

‘అ..ఆ’ కొత్త కాంట్రవర్శీ: పైరసీ, అరెస్ట్ లేదు, ఎందుకింత అబద్దం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నితిన్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'అ..ఆ'. ఈ చిత్రం ఇప్పటికే మీనా చిత్రం కాపీ కొట్టారంటూ వివాదం తలకెత్తుకుని ఉంటే ఇప్పుడు మరొకటి యాంటి ఫ్యాన్స్ చేతికి దొరికింది. రెండు రోజుల క్రితం ఈ చిత్రం పైరసీ చేస్తూంటే, ఒకరిని పట్టుకున్నారంటూ యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఇచ్చిన ప్రెస్ నోట్ తప్పని తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 'అ..ఆ... చిత్రాన్ని సెల్ ఫోన్ ద్వారా .... పైరసీ చేసి లైవ్ లో ఈ చిత్రాన్ని ఫేస్ బుక్ లో స్ట్రీమింగ్ చేసారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారని కూడా అన్నారు. ఆ వ్యక్తి .. వాల్పారైజో యూనివర్సిటీ విద్యార్ధిని చికాగో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. చికాగో ప్రాంతంలోని మువికో రోజ్మాంట్ థియేటర్లో ఇతను పైరసీకి పాల్పడ్డాడు' ఇదీ బ్లూ స్కై మూవీస్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్.


అయితే ఇప్పుడు కొత్త విషయం ఒకటి అందరికీ షాక్ ఇస్తూ బయిటకు వచ్చింది. అసలు ఇదంతా నిజమేనా అని ఎంక్వైరీ చేసిన వారు షాక్ అయ్యేటట్లు అక్కడ అంతేమీ జరగలేదనిని తెలిసిందే. అసలు తాము గత వారం రోజులుగా ఏ ఒక్క విద్యార్ధినీ అరెస్ట్ చేయలేదని రోజ్మాంట్ పోలీసులు తేల్చి చెప్పారని తెలుస్తోంది. పైగా బ్లూస్కై ఇచ్చిన కేస్ నెంబర్ ఫార్మాట్ కూడా కరెక్ట్ కాదని తేల్చేసారు.ఈ విషమయై కొంత వాషింగ్ టన్ టైమ్స్ పత్రికలో వచ్చింది.


False claim by “A Aa” USA Distributor?

'మా కేస్ నెంబర్స్ అన్నీ 2తో స్టార్ట్ అవుతాయి. కానీ ఇందులో 'T16000061' అనే లెటర్ తో కేస్ నెంబర్ ఉంది. భారతీయ విద్యార్ధిని అరెస్ట్ చేయడం జరగలేదు. మువికో థియేటర్ కానీ.. ఈ ఏరియాలో వేరే ఏ థియేటర్ లో కానీ ఇలాంటి సంఘటన జరగలేదు' అని తేల్చేశారు రోజ్మాంట్ పోలీసులు అని తెలుస్తోంది.


మరి ఇలాంటి చీప్ పబ్లిసిటీకి పాల్పడ్డానికి రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి బ్లూ స్కై మూవీస్ కు అంత అవసరం ఏమొచ్చిందో అని అక్కడ విషయం ఎంక్వైరీ చేసిన వారు మండిపడుతున్నారు. ఇలాంటి ప్రెస్ నోట్స్ పంపి ఎందుకు పరువు తీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.


False claim by “A Aa” USA Distributor?

ఇక ఈ చిత్రం యూఎస్‌ఏలో మంచి వసూళ్లను రాబడుతోంది. సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. బుధవారం (266,729 డాలర్లు), గురువారం (214,184 డాలర్లు) మొత్తం రూ. 3.22 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వారాంతంలో మంచి వసూళ్లను రాబట్టే దిశగా 'అ..ఆ' కొనసాగుతోందని ట్వీట్‌ చేశారు.


త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందిన సంగతి తెలిసిందే.

English summary
A Aa film’s overseas distributor, sent out a press note to web media which stated that “A student from Valparaiso University was arrested for filming A Aa movie in Muvico Rosemont theater in Chicago area”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu