»   » అవి బాలయ్య 100వ సినిమా లొకేషన్లంటూ తప్పుడు ప్రచారం!

అవి బాలయ్య 100వ సినిమా లొకేషన్లంటూ తప్పుడు ప్రచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 100వ సినిమా క్రిష్ దర్శకత్వంలో మొదలు కావడం, ప్రస్తుతం మొరాకోలో షూటింగ్ కూడా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ యుద్ధానికి సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇంటర్నెట్ పుణ్యమా అని సినిమా సెట్స్ కు సంబంధించిన ఫోటోలు వెంట వెంటనే బయటకు లీక్ అవుతూనే ఉన్నాయి.

అయితే సందెట్లో సడేమియాలా మరికొన్ని ఫోటోలు కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నారు. అవి కూడా బాలయ్య సినిమా షూటింగు లోకేషన్ ఫోటోలే అని, అక్కడ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ జరుగుతుందనే ప్రచారం మొదలైంది. అయితే ఆ ఫోటోలు జోర్డాన్ లోని పెట్రా గుహలకు సంబంధించివి కావడంతో వాటి గురించి తెలిసిన వారు అయోమయంలో పడ్డారు.


False Location news on Gautamiputra Satakarni

బాలయ్య సినిమా షూటింగ్ మొరాకోలో జరుగుతుంటే ఈ ఫోటోలు ఏమిటా అని ఆరా తీసారు. బాలయ్య సినిమా షూటింగ్ మొరాకోలోనే జరుగుతోంది. జోర్డాన్ లోని పెట్రా గుహల వద్ద జరుగడం లేదని తేలిపోయింది. సో... బాలయ్య సినిమాకు సంబంధించిన ఇదో తప్పుడు ప్రచారం అన్నమాట. స్టార్ హీరోల సినిమాలు జరుగుతున్నపుడు ఏవో చిన్న గాసిప్పులు ప్రచారం జరుగడం మామూలే. బాలయ్య 100వ సినిమా విషయంలోనూ ఇవి మొదలయ్యాయన్నమాట.


యుద్ధ సన్నీవేశఆలకు సంబంధించిన షెడ్యూల్ 24 రోజులపాటు మొరాకోలో ప్లాన్ చేసారు. ఇందులో దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఎనిమిది కోట్లు ఖర్చుతో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలను దాదాపు నాలుగు టన్నుల మెటీరియల్ తో తయారు చేయించారట.


False Location news on Gautamiputra Satakarni

సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. ఇందుకోసం 'బాహుబలి' సినిమాకు విజువల్ ఎపెక్ట్స్ అందించిన 'మకుట' సంస్థను దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా క్రిష్ భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా సినిమా చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారు.


మొరాకో షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా టీం తిరిగి ఇండియా వస్తామని తెలిపారు. ఈ సినిమాకు హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. నయనతారను సంప్రదించాం. ఆమెకు ఇంట్రెస్టు ఉన్నా సెప్టెంబర్ వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవు. అప్పటి వరకు మేము ఆగదలుచుకోలేదు. మూడో షెడ్యూల్ నుండి హీరోయిన్ అవసరం ఉంటుంది. త్వరలోనే ఎవరో ఒకరిని ఖరారు చేస్తాం అని రాజీవ్ తెలిపారు.

English summary
False Location news rounds on Balakrishna's Gautamiputra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu