»   » కైకాల సత్యనారాయణ మృతి చెందినట్లు ప్రచారం, ఎలాగో కూడా చెప్పేశారు!

కైకాల సత్యనారాయణ మృతి చెందినట్లు ప్రచారం, ఎలాగో కూడా చెప్పేశారు!

Subscribe to Filmibeat Telugu

తెలుగులో దిగ్గజ నటులలో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. కానీ దిగజారుతున్న సోషల్ మీడియా వలన తన చావు వార్తని తానే వినవలసి పరిస్థితికి ఆయనకు కలిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కైకాల సత్యనారాయణ మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు విని ఆయన షాక్ కి గురయ్యారు.

False news circulating on Kaikala Satyanarayana

నిన్న ప్రముఖ నటుడు వంకాయల సత్యనారాయణ మూర్తి మరణించారు. దీనితో ఆయనకు బదులుగా కైకాల సత్యనారాయణ మరణించారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అనారోగ్యంతో ఆయన మరణించినట్లు కూడా తేల్చేశారు. దీనితో ఈ వార్త ఆనోటా ఈ నోటా పడి మా ఆర్ట్ అసోసియేషన్ చెవిన పడింది. బ్రతికున్న వ్యక్తి చనిపోయాడంటూ ప్రచారం చేయడం ఏంటి అని రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. కైకాల సత్యనారాయణ క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించకుండా నిజానిజాలు తెలుసుకుని స్పందించాలని కోరారు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

English summary
False news circulating on Kaikala Satyanarayana. Maa association gives clarity
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu