For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇక హీరో శ్రీకాంత్ కూడానా!? ఒకరివెనుక ఒకరుగా ఏమిటిలా

  |

  తెలుగు సినిమాలో హీరో లకి ఒక ప్రత్యేక ముద్ర పడటం ఎంత ప్రమాదకరమో తెలియంది కాదు. మాస్ హీరో, క్లాస్ హీరో, ఫ్యామిలీ హీరో అంటూ ఒకేే రకమైన ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోవటం తో కొన్నాళ్ళకి అవకాశాలే లేని పరిస్థితి ఎదురౌతోంది. చిరంజీవీ,బాలకృష్ణ లాంటి అగ్రహీరోలు ఇన్ని సంవత్సరాలు గా ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం అదే...

  క్లాస్,మాస్,ఫ్యామిలీ అంటూ అన్నిటినీ మార్చి మార్చి చేస్తూ ఒకేరకమైన ట్యాగ్ లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పటి తరం లో మహేష్, ప్రభాస్ లు చేస్తున్నదదే. హీరో రవితేజ కూదా ఇప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితికి దగ్గరలో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాక్షన్,యాక్షన్ హీరో అని ముద్ర పడుతూన్న సంగతిని గ్రహించి వెంటనే అదుర్స్,ఊసరవెళ్ళి,బృందావనం లాంటి సిన్మాలతో తానూ ఒకే ఇమేజ్ లో ఇరుక్కునే వాడిని కాదనినిరూపించుకున్నాడు.

  అయితే ఈ చిన్న లాజిక్ తట్టని ఒకప్పటి హీరోలు మాత్రం ఇప్పుడు విలన్ లుగా మారుతున్నారు. ఫ్యామిలీ హీరో లు అనిపించుకున్న ఒకప్పటి హీరోలు వినోద్ కుమార్, రఘు లు ఎప్పుడో విలన్లు గా మారినా అక్కడా నిలదొక్కుకో లేక పోవటం తో. తెరకి దూరంగా ఉండటమే హుందాతనం అనుకొని నటనకి దూరమయ్యారు.

  ఒకప్పటి హీరో లైన వడ్డె నవీన్.. రాం గోపాల్ వర్మ "ఎటాక్" లోనూ, తమిళ హీరో "అర్జున్" మణి రత్నం కడలి లోనూ...లేటెస్ట్ గా "తనీ ఒరువన్ తో అరవింద్ స్వామీ కూడా ఇదే బాటలోకి వచ్చి కొత్త తరహా ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే విలన్ లు గా సక్సెస్ అయిన వారిలో మొదటి స్థానం జగపతి బాబుదే.

  ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసిన జగపతి బాబు మంచి విజయాలు సాధిస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా అవకాశాల కోసం ఎదురుచూసిన జగపతి బాబు, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లో కూడా సత్తా చాటుతున్నాడు.

  Family hero Srikanth to act as villain in Tamil movie

  ఇక జగపతి బాబుని చూసి ఇన్స్పైర్ అయిన హీరో రాజశేఖర్ కూడా విలన్ గా రాబోతున్నాడు.హీరో గోపీ చంద్ సినిమాలో విలన్ గా చేయటానికి ఒప్పుకున్నాడట ఒకప్పటి ఫ్యామిలీ,యాక్షన్ హీరో. ఇక్కద ఒక విచిత్రం ఏమిటంటే.. ఈ సినిమాలో హీరో గోపీ చంద్ కూడా ఒకప్పుడు విలన్ అయిఉండటం..

  ఇప్పుడు ఈ సీనియర్ ఫ్యామిలీ హీరోల బాటలోనే హీరో శ్రీకాంత్ కూడా విలన్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.చాలా రోజులుగా హీరోగా సక్సెస్ సాధించలేకపోతున్న శ్రీకాంత్, కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. గోవిందుడు అందరి వాడేలే, సరైనోడు సినిమాల్లో హీరో బాబాయ్ గా నటించిన శ్రీకాంత్, ఓ తమిళ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నాడు.

  ఓకప్పుడు విలన్ గానే టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారారు. అయితే ఒకటీఅరా తప్ప అన్నీ సాఫ్ట్ క్యారెక్టర్లే కావటం తో కొన్నాళ్ళకి హీరొగా అవకాశాలు తగ్గిపోయాయి. శంకర్ దాదా సిరీస్ లో చేసిన ఏటీయం క్యారెక్తర్ మంచి పేరే తెచ్చినా... హీరో గా అవకాశా లు తగ్గిపోతాయని ఆ తర్వాత వచ్చిన క్యారెక్టర్ పాత్రలు ఒప్పుకోలేదు. కానీ మరీ రోజు రోజుకీ పరిస్థితులు దిగజారుతుంటే ఇక తప్పలేదన్నట్టు శ్రీకాంత్ కూడా విలనిజం బాట పట్టాడు.

  ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇన్నాళ్లు విలన్ల కొరతతో పరభాష నటుల మీద ఆధారపడ్డ తెలుగు దర్శక నిర్మాతలు సీనియర్ హీరోల నిర్ణయంతో ఆనందంగా ఉన్నారు. వీరివల్ల సినిమాకి అదనపు గ్లామర్, కూడా పరభాష నటులని బతిమాలి మరీ తెచ్చుకునే భాదా తప్పుతుంది కదా...

  English summary
  Hero Sreekant shared media that soon people could se his villainous side yet again. Now he is planning to act as villain in a Tamil movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X