»   » అభిమాని అసభ్య ప్రవర్తన, చేయి చేసుకున్న సమంత

అభిమాని అసభ్య ప్రవర్తన, చేయి చేసుకున్న సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ మాయ చేశావె హీరోయిన్ సమంతకు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతనిపై ఓ చెంప పెట్టు పెట్టింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సమంత తిరిగి వెళ్లిపోయే ముందు తీవ్ర ఇబ్బందికి గురైంది. తిరుపతిలోని ఎక్స్‌ ప్రెస్ మొబైల్ షాపింగ్ మాల్‌ ను ప్రారంభించడానికి ఆమె తిరుపతి వచ్చింది. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్లిపోతున్న సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెను కదలకుండా చేశారు. ఈ సమయంలో ఓ అభిమాని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతనిపై చేయి చేసుకుంది. మరో ఇద్దరిని కూడా ఆమె కొట్టినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. భద్రతా చర్యలు సరిగా లేకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిర్వాహకులు సమంతకు ప్రైవేట్ వ్యక్తులతో భద్రత కల్పించలేదు. ప్రభుత్వ భద్రతతో పాటు సెలబ్రిటీలో వచ్చే సమయంలో ఆయ సంస్థలు ప్రైవేట్ భద్రత కల్పిస్తారు. కానీ అ చర్యలేవీ మొబైల్ షాపువాళ్లు తీసుకోలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu