»   » అభిమానే సూపర్ స్టార్ కు శత్రువుగా మారితే? (ట్రైలర్ అదిరింది)

అభిమానే సూపర్ స్టార్ కు శత్రువుగా మారితే? (ట్రైలర్ అదిరింది)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫ్యాన్'. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ నిన్న విడుదలైంది. మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా...ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.

తన అభిమాన నటుడి కోసం ఎంతకైనా తెగించే ఒక అభిమాని.... అదే హీరోకు శత్రువుగా మారితే ఎలా ఉంటుంది? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇదో యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోందని స్పష్టమవుతోంది. అభిమానిగా, హీరోగా రెండు పాత్రల్లోనూ షారుక్ భిన్నమైన కోణాల్లో నటిస్తున్నాడు.

కథ విషయానికొస్తే....గౌరవ్(షారుక్ ఖాన్) అనే 20 ఏళ్ల యువకుడి చుట్టు ‘ఫ్యాన్' కథ తిరుగుతుంది. మెగా మూవీ స్టార్ ఆర్యన్ ఖాన్(షారుక్ ఖాన్)కు గౌరవ్ వీరాభిమాని. అతడే తన ప్రపంచంగా బ్రతుకుతుంటాడు. అతన్ని ఒక నటుడిగా కాకుండా దేవుడిగా కొలుస్తాడు. అయితే కొన్ని పరిణామాలు సదరు అభిమానే ఆ హీరోకు శత్రువుగా మారేలా చేస్తాయి. ఆ తర్వాత ఏ జరిగింది అనేది తెరపై ఉత్కంఠ భరింతంగా చూపించబోతున్నారు.

Fan Official Trailer

యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో ఆదిత్య చోప్రా ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ డబల్ రోల్ చేస్తున్నాడు. హీరోయిన్ లేకుండా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఏప్రిల్ 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
FAN is the story of Gaurav (Shah Rukh Khan) a young man, 20 something, whose world revolves around the mega movie star Aryan Khanna (Shah Rukh Khan) or God as he refers to him. When things dont go according to plan, Gaurav’s love and passion for his God turns in to a dangerous obsession that crosses the fine line. Watch an edge of the seat thriller, FAN which will peel away at both Gaurav and Aryan’s personalities and characters as the two men discover people within themselves that even they didnt know existed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu