ఎన్టీఆర్ గుడి కోసం కిడ్నీ అమ్మకానికి అభిమాని

తాజాగా ఓ అభిమాని ఆయన కోసం గుడి నిర్మించడానికి కిడ్నీలను అమ్మకానికి సిద్ధమయ్యాడు. గుడి నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నాడు. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లెకు చెందిన పెనుమచ్చ శ్రీనివాసులు ఎన్టీఆర్‌కు వీరాభిమాని.
శ్రీనివాసులు తన స్వగ్రామంలో ఎన్టీఆర్ కోసం ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. తిరుపతి నుంచి విగ్రహాన్ని తెప్పించి గుడిలో పెట్టారు. అయితే శ్రీనివాసులకు ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆలయ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఆలయ నిర్మాణానికి దాతలు ఎవరూ ముందుకు రాకపోవడం లేదు.
దీంతో తన కిడ్నీలు అమ్మి అయినా ఆలయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు శ్రీనివాసులు. కిడ్నీలు అవసరమైన వారు ఎవరైనా తనను సంప్రదిస్తే ఇస్తానంటున్నాడు. ఈ విషయం మీడియా ద్వారా రాష్టమంతటా ప్రచారం కావడంతో....శ్రీనివాసులు వీరాభిమానం చూసి ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











