»   » చిరు, పవన్‌ కళ్యాణ్‌ లపై మాకు పేటెంట్ హక్కు ఉంది..అందుకే

చిరు, పవన్‌ కళ్యాణ్‌ లపై మాకు పేటెంట్ హక్కు ఉంది..అందుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు కథ ఇవ్వటమంటే మాటలు కాదు. వారికి కథ చెయ్యటం కోసం ఇండస్ట్రీలోని పెద్ద రైటర్లు అంతా పోటీ పడుతూంటారు. అలాగే వారి వీరాభిమానులు సైతం తమ హీరోలకు తగిన ఇవ్వాలని ఉత్సాహపడుతూంటారు.

తమ అభిమాన హీరోను తాము ఎలా చూడాలని అనుకుంటున్నారో ఊహిస్తూ కథలు రెడీ చేస్తారు. అయితే వీరిని ఎప్రోచ్ అయ్యేది ఎలా..కథలు వినిపించేది ఎలా..దీనికి మీడియా ద్వారా వెళ్లాలని ఓ పరిష్కారం కనుక్కున్నారు. అందులో భాగంగా..ఫ్యాన్స్ మీటింగ్ పెట్టి ..మీడియాకు తెలియచేసారు.

Fan request to Pawan and chiranjeevi

అందులో భాగంగా... చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ లు నటించబోయే చిత్రాల కోసం ఓ అభిమాని రాసిన కథను పరిశీలించాలని ఫ్యాన్స్‌ స్టార్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రచయిత హరికృష్ణ మాట్లాడారు. చిన్నప్పటి నుంచి తాను చిరంజీవి అభిమానినన్నారు.

ఇప్పటి వరకు 100 కిలోమీటర్లు పరిగెత్తడంతో పాటు 150 సార్లు రక్తదానం చేశానన్నారు. చిరంజీవి స్ఫూర్తితో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టానన్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల కోసం ప్రత్యేకంగా తాను సందేశాత్మకమైన కథను రాశానన్నారు.

తన కథను పరిశీలించి వారు నటించాలని, అభిమానిగా తనకు పేటెంట్‌ హక్కు ఉందన్నారు. దీనికి వారు స్పందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ సభ్యులు ఎస్‌డీ షాకీర్‌, సతీష్‌, సైదులు, శివ, వేణుమాధవ్‌, క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.

English summary
A Fan requests pawan and Chiranjeevi to take his story through media meeet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu