»   » బాలయ్య అభిమానులు ఆపి మరీ...

బాలయ్య అభిమానులు ఆపి మరీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలో వైభవంగా జరిగింది.

డిక్టేటర్‌ ఆడియో విడుదల కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి అమరావతికి వెళ్తున్న సినిమా యునిట్ కి నందమూరి అభిమానులు నీరాజనం పట్టారు.


పలు చోట్ల అభిమానులు బాలకృష్ణ కాన్వాయ్‌ని ఆపి అభినందనలు తెలియజేసారు. ఈ ర్యాలీకి సంబంధించిన పలు చిత్రాలను దర్శకుడు శ్రీవాస్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక్కడ దానికి సంబందించిన ఫోస్ట్ చూడవచ్చు.


Posted by Director Sriwass on Sunday, December 20, 2015

నందమూరి బాలకృష్ణ, అంజలి ప్రధాన పాత్రల్లో శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన డిక్టేటర్‌ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం ఆరు గంటలకి అమరావతిలో ప్రారంభమై విజయవంతమైంది.


ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి చిత్ర కథానాయకుడు బాలకృష్ణకు అందించారు. బాలకృష్ణ నటించిన 99వ చిత్రమైన ‘డిక్టేటర్‌' అద్భుత విజయం సాధించాలని కోరుకున్నారు.

English summary
Balakrishna Fans very happy with Dictator Audio launch.
Please Wait while comments are loading...