»   » అభిమానుల తాకిడి..గాయపడిన స్నేహాఉల్లాల్

అభిమానుల తాకిడి..గాయపడిన స్నేహాఉల్లాల్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  గుంటూరు : అభిమానుల తొక్కిసలాటలో సినీనటి స్నేహాఉల్లాల్‌కు స్వల్పగాయాలయ్యాయి. గుంటూరులోని కొరిటెపాడు సెంటర్‌లో కళ్లజోళ్ల షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వాస్తవానికి ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం జరగాల్సివున్నా ఆమె రాక ఆలస్యమైంది. దీంతో అభిమానులు పెద్దసంఖ్యలో షోరూమ్ వద్ద గుమికూడారు. స్నేహాఉల్లాల్ రాగానే ఒక్కసారిగా తొపులాట జరిగింది. ఈ ఘటనలో అమె కిందపడడంతో కాలికి, పెదాలకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై అమెకు రక్షణ వలయంగా నిలిచారు. పోలీసుల సాయంతో స్నేహాఉల్లాల్ వెంటనే షోరూమ్‌ను ప్రారంభించారు.


  స్నేహా ఉల్లాల్ ముందుగా అభిమానులకు అభివాదం చేస్తూ రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఉన్న వివిధ రకాల కళ్ల జోళ్లను ఆమె పరిశీలించారు. కొన్ని మోడల్స్‌ను ధరించి అభిమానులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఉల్లాల్ మాట్లాడుతూ... సంస్థకు చెందిన కొన్ని మోడల్స్‌ను తాను వాడినట్లు స్నేహ ఉల్లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ యజమాని వెంకటరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.సిల్వర్ జూబ్లీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు...త్వరలో సిల్వర్ జూబ్లీ ఆడే చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తానని నటి స్నేహ ఉల్లాల్ చెప్పారు. దూకుడు చిత్ర నిర్మాతతో తెలుగు, హిందీ భాషలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారన్నారు. మరోమూడు చిత్రాలకు కథ విని ఓకే చేసినట్లు ఉల్లాల్ వివరించారు. నెల రోజుల్లో రెండు చిత్రాల షెడ్యూల్‌ను ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు.

  కొరిటెపాడులో సందడి వాతావరణంస్నేహ ఉల్లాల్ కొరిటెపాడులోని కళ్లజోళ్ల దుకాణం ప్రారంభోత్సవానికి వస్తుందని తెలుసుకొని ప్రేక్షకులు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఆమె కారు నుంచి దిగగానే కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఆమెను దగ్గర నుంచి చూసేందుకు యువకులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెను చూసేందుకు ప్రేక్షకులు రావటంతో అక్కడ తోపులాట సంభవించింది. దీంతో స్నేహ ఉల్లాల్ ఎడమ కాలుకు స్వల్ప గాయమైంది. కొద్ది సేపటి తరువాత ఆమె షోరూంను ప్రారంభించారు. పోలీసులు ప్రేక్షకులను చదరగొట్టారు.

  English summary
  Sneha Ullal got hurt when fans went overboard during a shop opening ceremony in Guntur. As there is a lack of proper security, the stampede took place. Preliminary reports indicate that Sneha Ullal got her leg fractured. Though there are no happening projects for Sneha Ullal, she is right now waiting for her upcoming Telugu flick 'Action 3D'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more