»   » బాలయ్యకు బహుమతిగా ‘సింహం’

బాలయ్యకు బహుమతిగా ‘సింహం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి హీరో బాలయ్యకు అభిమానులు బహుమతి ఇవ్వబోతున్నారు. నందమూరి నటసింహం అని ముద్దుగా పిలుచుకునే తమ అభిమాన హీరోకు ‘సింహం' విగ్రహాన్ని గిఫ్టుగా ఇవ్వబోతున్నారు. రూ. 10 లక్షల ఖర్చుతో క్రిస్టల్ గ్రానైట్ తో గోధుమ రంగులో దీన్ని తయారు చేయిస్తున్నారు. 10 అడుగుల పొడవు, 4.5 అడుగుల ఎత్తుతో దీన్ని తయారు చేయిస్తున్నారు. బాలయ్య 100వ చిత్రం ప్రారంభోత్సవంలో దీన్ని బాలయ్యకు బహూకరించనున్నారు.

ఈ విషయమై ఎన్.బి.కె హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపకుడు అనంతపురం జగన్ మాట్లాడుతూ..‘బాలయ్య 100వ చిత్రం ప్రారంభం నాటికి విగ్రహాం సిద్ధం అవుతుంది. ఒక స్టార్ వారసుడిగా 100 సినిమాలు పూర్తి చేసుకుంటున్న ఘనత ఆయనది. అందుకే 100వ సినిమా ప్రారంభోత్సవ వేడుకలను ప్రత్యేకంగా జరుపాలనుకుంటున్నాం' అన్నారు. దీంతో పాటు ‘నందమూరి శిఖరం' పేరుతో పుస్తకాన్ని ఆయనకు సమర్పిస్తాం. బాలయ్య సినీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు ఆ పుస్తకంలో ఉంటాయన్నారు.

 Fans to gift Balakrishna

బాలయ్య సినిమాల విషయానికొస్తే...
గతేడాది 'లెజెండ్‌'తో విజయాన్ని సొంతం చేసుకొన్న బాలకృష్ణ త్వరలో 'లయన్‌'గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే . బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లయన్‌'. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత.

దర్శకుడు మాట్లాడుతూ... ''సామాన్యుడికి బాసటగా నిలిచే ఓ వ్యక్తి కథతో రూపొందుతున్న చిత్రమిది. శక్తిమంతమైన పాత్రతో మరోసారి అలరించబోతున్నారు బాలకృష్ణ' అని తెలిపారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.

English summary
Nandamuri Balakrishna is fondly referred as the 'Nandamuri Natasimham' by his fans who've decided to gift him a 'Lion' to commemorate the launch of the actor's 100th film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu