twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: చిరంజీవి డౌన్‌డౌన్‌ ...శ్మశానంలో నినాదాలు

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : ఉదయ్‌కిరణ్‌ అంత్యక్రియలకు అభిమానులు వేలసంఖ్యలో పోటెత్తారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు చెట్లు, భవనాలు, వాహనాలపైకెక్కి కంటతడి పెడుతూ కనిపించారు. ఉదయ్‌కిరణ్‌ అమర్‌హై, చిరంజీవి డౌన్‌డౌన్‌ నినాదాలతో శ్మశానవాటిక హోరెత్తింది. ఉదయ్‌కిరణ్‌ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం కనిపించింది. ఇదే ఫిల్మ్ సర్కిల్సో లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేఫధ్యంలో అందరూ చిరంజీవి కుమార్తెతో, ఉదయ్ కిరణ్ నిశ్చితార్దం ఆగిపోయిన విషయం గుర్తు చేసుకున్నారు.

    అలాగే చిరంజీవితో పాటు నాగబాబు,పవన్ కళ్యాణ్,రాం చరణ్ తేజ, అల్లు అరవింద్ .. ఉదయ్ కిరణ్ పార్దివ దేహం ఉంచిన ఫిలిం ఛాంబర్ కి రాకపోవటం చర్చనీయాంసమైంది. అలాగే దాసరి కామెంట్స్ కూడా అందరినీ ఆలోచనలో పడేసింది. ఉదయ్‌కిరణ్‌కు వచ్చిన అవకాశాలను దక్కనివ్వకుండా కొన్ని శక్తులు అతని జీవితంతో ఆడుకున్నాయనీ, అందువల్లే అతను డిప్రెషన్‌లోకి వెళ్లి, ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనిపిస్తున్నదని దాసరి నారాయణరావు ఆరోపించారు. కెరీర్ మొదట్లోనే ఉదయ్‌ని చూసి శోభన్‌బాబు అంతటి అందగాడు వచ్చాడని అనుకున్నాననీ, అటువంటి చక్కని కళాకారుడు బలవన్మరణానికి పాల్పడటం దురదృష్టకరమనీ ఆవేదన వ్యక్తం చేశారు.

    Fans shout slogans against Chiranjeevi at Uday Kiran's funeral

    మంగళవారం మధ్యాహ్నం భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలో హిందూ శశ్మానవాటికకు తీసుకొచ్చారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో యువకులు, సినీ అభిమానులు, కళాశాలల విద్యార్థులు శ్మశానానికి పెద్దసంఖ్యలో చేరుకోవడం కనిపించింది. కొందరు అభిమానులు భోరున విలపిస్తూ కనిపించారు. చెట్లెక్కిన కొంతమంది కిందపడి గాయపడ్డారు. తొక్కిసలాటకు దారితీస్తున్న క్రమంలో పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
    ఉదయ్‌కిరణ్‌ భార్య విషిత, కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు కుమారుడి చితికి తండ్రి వి.వి.కె.మూర్తి నిప్పుపెట్టారు. చిత్రసీమ నుంచి దాసరి నారాయణరావు, డి. రామానాయుడు, వెంకటేశ్, డి. సురేశ్, జి. ఆదిశేషగిరిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, జయసుధ, శ్రీకాంత్, సునీల్, ఎమ్మెస్ రాజు, తనికెళ్ల భరణి, ఎం.ఎల్. కుమార్‌చౌదరి, అల్లరి నరేశ్, సుధీర్‌బాబు, శివాజీ, అలీ, వరుణ్ సందేశ్, తనీశ్, వి.ఎన్. ఆదిత్య, శివలెంక కృష్ణప్రసాద్, టి. ప్రసన్నకుమార్, అశోక్‌కుమార్, విజయచందర్, చలపతిరావు, కాశీవిశ్వనాథ్, మధుర శ్రీధర్, శివాజీరాజా, బెనర్జీ, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, నవీన్‌చంద్ర, కె.ఎల్. దామోదర్‌ప్రసాద్, బెక్కెం వేణుగోపాల్, అనూప్ రూబెన్స్, కాదంబరి కిరణ్ తదితరులు ఉదయ్ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన మృతికి నివాళులర్పించారు.

    English summary
    The last rites of actor Uday Kiran were performed at the Erragadda cremation grounds on Tuesday afternoon. Uday Kiran's body was kept at the AP Film Chamber of Commerce in the morning and film personalities paid their respects to the departed actor. Some agitated fans of Uday Kiran raised slogans against union minister Chiranjeevi at the cremation grounds at Erragadda. Some well-known personalities belonging to prominent families in the film industry were not seen at the film chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X