twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మిర్చి' ఆడియో పంక్షన్ లో గొడవ..పోలీసులకు గాయాలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో శనివారం రాత్రి మిర్చి సినిమా ఆడియో విడుదల వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. వేడుకకు పాస్‌లు జారీ చేసిన సంఖ్యకు మించి ప్రభాస్‌ అభిమానులు చేరుకున్నారు. అప్పటికే ఆడియో విడుదల ప్రాంగణం వేలాది మంది అభిమానులతో కిక్కిరిసింది. లోపల ఖాళీ లేదంటూ పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. కొందరు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

    అప్రమత్తమైన పోలీసులు వెంబడించడంతో ఆందోళనకు దిగిన వారంతా చెల్లాచెదురుగా పారిపోయారు. వేడుక కవరేజీకి వెళ్లిన ఓ విలేకరిపైనా ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. పాస్‌లు ఉన్నాయని చూపిస్తున్నా అవి చెల్లవంటూ రాము అనే వ్యక్తి దాడికి దిగాడు.

    టీవీలో ప్రత్యక్ష ప్రసారం అయిన ఈ వేడుక ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. రచయిత కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేస్తూ తొలి ప్రయత్నంగా వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ పాటలు అందించారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, వీవీ వినాయక్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలాదేవి ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఆడియో సీడీని రాజమౌళికి ఇచ్చిన అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ -''గుంటూరు మిరపకాయ అంత ఘాటుగా ఉండే 'మిర్చి' ఇది అన్నారు.

    English summary
    With fans ramming into stage to get a glimpse of their heartthrob hero and security people failing to control them, our hero has left the venue with a bitter taste. This happened during 'Mirchi' audio release function and here it goes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X