»   » బాలకృష్ణని స్టార్ హీరోయిన్స్ రిజక్ట్ చేస్తున్నారా?

బాలకృష్ణని స్టార్ హీరోయిన్స్ రిజక్ట్ చేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ సినిమాలో నటించటానికి హీరోయిన్స్ దొరకటం లేదా..ఎవర్ని అడిగినా డేట్స్ ఖాళీ లేవని తప్పించుకుంటున్నారా..ఇదే టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వర్గం విపరీతంగా చర్చిస్తోంది. ఎందుకంటే దాసరి నారాయణ రావు దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం పరమ వీర చక్రలో ఎంపిక చేసుకున్న హీరోయిన్స్ చూసే ఈ టాపిక్స్ రైజ్ అవుతున్నాయి. ఎప్పుడో ఫేడవుట్ అయిపోయిన బాలీవుడ్ బ్యాచ్ అమీషా పటేల్, నేహా ధూపియాలు, కెరీర్ ముందుకు సాగని షీలా ఈ చిత్రంలో చేస్తున్నారు. మరో ప్రక్క అమీషాపటేల్..మరీ ఘోరంగా షేప్ అవుట్ అవటం, అయినా ఆమెను ప్రమోట్ చేయటం పలు రకాల విమర్శలకు తావిస్తోంది. ఇక బాలయ్య అభిమానులు కొందరైతే ఫోన్స్, మెసేజ్ లు, లెటర్స్ ద్వారా ఈ విషయాన్ని దర్శక,నిర్మాతలకు తెలియపరిచారని చెప్పుకుంటున్నారు. అయినా సింహా లాంటి హిట్టిచ్చిన తర్వాత బాలయ్యకు హీరోయిన్స్ కొరత ఏమిటన్నది అందరికీ అర్ధంకాని మిస్టరీగానే మిగిలింది.

Please Wait while comments are loading...