»   » తండ్రి అయిన నటుడు ఫర్దీన్ ఖాన్

తండ్రి అయిన నటుడు ఫర్దీన్ ఖాన్

Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఫర్దీన్ ఖాన్ సతీమణి బుధవారం కూతురుకు జన్మనిచ్చింది. ఫర్దీన్ ఖాన్ తన కూతురుకు దయానీ ఇసబెల్లా ఖాన్‌గా నామకరణం చేసినట్లు సమాచారం. ఈ శుభ వార్తను ఫర్దీన్ ఖాన్ కజిన్ అయిన ఫరాహ్ ఖాన్ అలీ (హృతిక్ రోషన్ సతీమణి సుజన్నే రోషన్ సోదరి) ట్విట్టర్‌లో పేర్కొంది.

ఒక అద్భుతమైన వార్తతో మేల్కొన్నామని, తన కజిన్ ఫర్దీన్ ఖాన్, అతని సతీమణి నటాషాలకు అందమైన కూతురు జన్మించిందని, ఆమెకు దయానీ ఇసబెల్లా ఖాన్‌గా నామకరణం చేసినట్లు ఫరాహ్ ఖాన్ అలీ తన సందేశంలో తెలిపింది.

తన చిన్న మేనకోడలు దయానీకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, సంపదను, సంతోషాన్ని ఇవ్వాలని ఫరాహ్ ఖాన్ అలీ కోరుకుంది. అలాగే చిన్న కోడలు తల్లిదండ్రులు ఫర్దీన్ ఖాన్, నటాషాలకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. కాగా 2005లో ఫర్దీన్ ఖాన్‌కు, నటాషాకు వివాహం జరిగింది. వారిద్దరికి దయానీ తొలి సంతానం. వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కూతురు కలగడంతో వారిద్దరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గతంలో ఒక సారి నటాషా గర్భవతి అయినప్పటికీ గర్భస్రావం కావడంతో తన ఇద్దరు కవల పిల్లలను కోల్పోయింది. ఆ సమయంలో కూడా ఫర్దీన్ ఖాన్ ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. తన భార్య నటాషా గర్భవతి అయినందుకు సంతోషంగా ఉన్నా.. ఆమెకు గర్భస్రావం కావడంతో అంతే బాధగా ఉందని పేర్కొన్నాడు.

English summary
Bollywood actor Fardeen Khan has become a father, after his wife delivered a baby girl on Wednesday (December 11, 2013). The actor has reportedly named daughter as Diani Isabella Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu