Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
శ్రద్ధాకపూర్ కోసం బాలీవుడ్ హీరోలు తన్నుకొన్నారట.. పార్టీలో రచ్చ రచ్చ!
బాలీవుడ్ అందాలతార శ్రద్ధాకపూర్ కోసం స్టార్ హీరోలు ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్యరాయ్ కపూర్ గొడవ పడినట్టు తెలిసింది. బాలీవుడ్‌లో భట్ ఫ్యామిలీ కెరీర్ 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో ఓ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో శ్రద్ధాకపూర్‌తో ఆదిత్య చనువుగా ఉండటాన్ని ఫర్హాన్ అఖ్తర్ జీర్ణించుకోలేకపోయాడట. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు చేజేసుకొన్నట్టు బాలీవుడ్ పత్రికల కథనాన్ని వెల్లడించాయి.

ఆషికీ2తో ఒకేసారి కెరీర్
బాలీవుడ్‌లో ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ ఇద్దరూ ఒకే సినిమాతో కెరీర్‌ను ప్రారంభించారు. వారు నటించిన ఆషికీ2 చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలో వారి కెమిస్ట్రీకి ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆషీకి2 సినిమాలో పాటలు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఆ సినిమా తర్వాత శ్రద్ధ, ఆదిత్య చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.

ఆదిత్య, శ్రద్ధా ఆఫైర్, బ్రేకప్
అప్పట్లో ఆదిత్య, శ్రద్ధా కపూర్‌ల మధ్య అఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే లవ్ బ్రేకప్ అయింది. అయినప్పటీకి వారి మధ్య సన్నిహిత సంబధాలున్నాయి. పార్టీలు వారు అడపాదడపా కలుసుకుంటున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఫర్హాన్‌తో శ్రద్ధా అఫైర్
ఇదిలా ఉండగా ‘భాగ్ మిల్కా భాగ్' నటుడు ఫర్హాన్ అఖ్తర్‌తో శ్రద్ధాకపూర్ ప్రేమలో పడినట్టు బాలీవుడ్ సర్కిల్స్‌లో విశేషంగా ప్రచారమవుతున్నది. అంతేకాకుండా వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ మధ్యలో ఫర్హాన్ అఖ్తర్ నివాసం నుంచి శ్రద్ధాకపూర్‌ను ఆమె తండ్రి, హిందీ చిత్రాల్లో ప్రముఖ విలన్ శక్తికపూర్ తీసుకెళ్లినట్టు కథనాలు ప్రచురితమయ్యాయి.

భట్ ఫ్యామిలీ విందులో గొడవ
భట్ ఫ్యామిలీ తాజాగా నిర్వహించిన విందుకు ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్యరాయ్ కపూర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో ఆదిత్యతో శద్ధా అతిచనువుగా వ్యవహరించడం ఫర్హాన్ అఖ్తర్‌కు ఆగ్రహం తెప్పించిందట. వెంటనే శ్రద్ధాకపూర్‌కు దూరంగా ఉండాలని సీరియస్‌గా ఆదిత్యను ఫర్హాన్ మందలించాడట.

ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం
ఈ క్రమంలో ఫర్హాన్ హెచ్చరికలను అదిత్య సీరియస్‌గా తీసుకోవడంతో వారిద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొన్నదని సమాచారం. పరిస్థితి చేజారి పోతుండటంతో శ్రద్ధా రంగంలోకి దిగి ఫర్హాన్, ఆదిత్యకు నచ్చజెప్పిందట. దాంతో వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం తగ్గుముఖం పట్టినట్టు సమాచారం.

భార్యకు దూరంగా ఫర్హాన్
వ్యక్తిగత విభేదాల వల్ల ఫర్హాన్ అఖ్తర్ తన భార్య అధునా అఖ్తర్ విడిపోయారు. ప్రస్తుతం వారిద్దరూ ఒంటరిగా గడుపుతున్నారు. భార్యతో విడిపోయిన తర్వాత శ్రద్ధాతో ఫర్హాన్ ప్రేమలో పడినట్టు, అధునా మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకొన్నట్టు రూమర్లు వచ్చాయి.