»   »  బాలీవుడ్ సింగర్ పై లైంగిక వేదిపుల కేసు

బాలీవుడ్ సింగర్ పై లైంగిక వేదిపుల కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో "బలుపు" (పాపులర్ పాట "పాతికేళ్ళ చిన్నది..."), "అదుర్స్" ("పిల్లా నా వల్ల కాదు..." ), "మిర్చి" ("యాహూ.. యాహూ...") లాంటి పాటలతో ఆకట్టుకున్న బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ కి కోర్టులూ, కేసులూ కొత్తేం కాదు. ఇదివరలో రాఖీ సావంత్ ని బహిరంగంగా ముద్దు పెట్టుకోబోయి కేసునీ విమర్శలనీ ఎదుర్కున్నాడు, తర్వాత తన షోకి వచ్చిన డాక్టర్ ని చితక బాది ఇంకో కేసునీ తలకెత్తుకున్నాడు.

 Fashion designer files case against Mika Singh

ఈ బాలీవుడ్ గాయకుడి పై ఇంకో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మోడల్ మికాసింగ్‌పై ముంబైలోని వెర్సోవా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మోడల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 323, 504ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మికాసింగ్ ఇంటి వద్ద మోడల్ తరచూ కలుస్తుంటుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇప్పుడు పోలీసులు విచారణలో ఆమె మికా ఇంటికి వచ్చినట్టు గా చెబుతున్న రోజు సీసీ కెమెరాల్లో ఉన్నది ఆమెనేనా కాదా అన్నది కంఫాం చేసుకునే పనిలో ఉన్నారట. ఆమె చెప్పిన వివరాల్లోనూ కొన్ని పొంతన లేని విషయాలు దొర్లటంతో పోలీసులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవటానికి మికా తో పాటు ఆ ఫ్యాషన్ డిజైనర్ మరింత విచారిస్తున్నారట.

English summary
The Versova police on Tuesday registered an First Information Report against singer Mika Singh after a Mumbai-based fashion designer approached the police and alleged that he had outraged her modesty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu