»   » మంచు లక్ష్మి విమర్శించిన పోస్టర్లో హీరోయిన్ ఈవిడే... (ఫోటో)

మంచు లక్ష్మి విమర్శించిన పోస్టర్లో హీరోయిన్ ఈవిడే... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు 'లేడీస్ టైలర్' లాంటి ఎవర్ గ్రీన్ హిట్ మూవీని తెరకెక్కించిన వంశీ.... దానికి సీక్వెల్ గా ఇపుడు 'ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ వివాదాస్పదం అయింది.

హీరోయిన్ ఎద అందాల కొలతలు తీసుకుంటున్నట్లు పోస్టర్ రూపొందించారు. అయితే అందులో హీరోయిన్ మొహం మాత్రం కనిపించలేదు. తాజాగా ఫుల్ ఫోటో రిలీజ్ చేసారు. అందులో నటిస్తుంది మరెవరో కాదు అనీషా ఆంబ్రోస్.


సుమంత్-అనీషా

సుమంత్-అనీషా

ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో సుమంత్ అశ్విన్ నటిస్తున్నాడు. మహిళ ఎద అందాల కొలతలు తీసుకునే ఈ పోస్టర్ మీద మంచు లక్ష్మి లాంటి వారు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.


సాంగ్ రిలీజ్

ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి మేటి దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం 'లేడీస్‌ టైలర్‌' అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆ పాత మధురం 'లేడీస్‌ టైలర్‌' సినిమాకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు అభిరుచిగల నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి.


నేటి ట్రెండుకు తగిన విధంగా

నేటి ట్రెండుకు తగిన విధంగా

''నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, ఆనాటి మేటి చిత్రం 'లేడీస్‌ టైలర్‌' స్థాయి ఏమాత్రం తగ్గకుండా, అంతకు మించి ప్రేక్షకుల్ని అలరించే కథ, కథనాలను రంగరించి, 'ఫ్యాషన్‌ డిజైనర్‌ - సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' పేరుతో ఈ సీక్వెల్‌ రూపొందుతోంది. అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం పాపికొండలు, రాజోలు పరిసరప్రాంతాల్లో నిర్విరామంగా 62 రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని నిర్మాత తెలిపారు.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈ వేసవికి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. నవ్వుల వర్షంలో ప్రేక్షులు తడిసి ముద్దయ్యేలా చేయనుంది 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' చిత్రం. ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మే నెల 3 వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అలాగే మే నెల మొదటి వారంలో సినిమా మ్యూజిక్‌ లాంఛ్‌ చేయనున్నాం'' అని మధుర శ్రీధర్‌ రెడ్డి వెల్లడించారు.


ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్

ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్

సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణి శర్మ, సినిమాటొగ్రఫి: నగేష్ బన్నెల్ , ఎడిటర్: భస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి వై సత్యనారాయణ, మాటలు: కల్యాణ్ రాఘవ్, పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీమణి, శ్రీవల్లి.


English summary
'Fashion Designer S/O Ladies Tailor' has embroiled in a controversy even before its theatrical release. Lakshmi Manchu didn't hesitate to criticize the pre-look poster which objectified women. Here is the still from this Adult Comedy that gives full view of the controversial approach chosen by the Makers. Sumanth Ashwin, who essays the role of a Young Fashion Designer, was seen taking the body measurements of Anisha Ambrose.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu