»   » అన్నీ నాన్న బుద్దులే.... (ఫ్యాష్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ ట్రైలర్ టీజర్)

అన్నీ నాన్న బుద్దులే.... (ఫ్యాష్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ ట్రైలర్ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.

ఆయన దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'లేడీస్‌ టైలర్‌' అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' సినిమా వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది.


అన్నీ నాన్న బుద్దులే

టీజర్ చూస్తుంటే.... లేడీస్ టైలర్ కుమారుడికి కూడా అన్నీ నాన్న బుద్దులే అబ్బాయని స్పష్టం అవుతోంది. వంశీ మార్కు కామెడీతో సినిమా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తుందని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అంటున్నారు.


తారాగణం

సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా

''నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, ఆనాటి మేటి చిత్రం 'లేడీస్‌ టైలర్‌' స్థాయి ఏమాత్రం తగ్గకుండా, అంతకు మించి ప్రేక్షకుల్ని అలరించే కథ, కథనాలను రంగరించి, 'ఫ్యాషన్‌ డిజైనర్‌ - సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' పేరుతో ఈ సీక్వెల్‌ రూపొందుతోంది. అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం పాపికొండలు, రాజోలు పరిసరప్రాంతాల్లో నిర్విరామంగా 62 రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని నిర్మాత తెలిపారు.


నవ్వులు ఖాయం

నవ్వుల వర్షంలో ప్రేక్షులు తడిసి ముద్దయ్యేలా చేయనుంది 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' చిత్రం. ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌కి, పాటలకు మంచి స్పందన వచ్చింది.


టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం: మణి శర్మ, సినిమాటొగ్రఫి: నగేష్ బన్నెల్ , ఎడిటర్: భస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి వై సత్యనారాయణ, మాటలు: కల్యాణ్ రాఘవ్, పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీమణి, శ్రీవల్లి.English summary
Here's the Teaser from Fashion Designer s/o Ladies. Cast: Sumanth Ashwin, Anisha Ambrose, Manali Rathode, Manasa Himavarsha. Director: Vamsy, Producer: 'Madhura' Sreedhar Reddy, DOP: Nagesh Banell, Editor: Baswa Pydi Reddy, Banner: Madhura Entertainment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu