»   » బాక్సాఫీసు వద్ద తండ్రి కొడుకుల ఫైట్

బాక్సాఫీసు వద్ద తండ్రి కొడుకుల ఫైట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తండ్రి కొడుకుల సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ నటించిన 'హీరోపంటి' చిత్రం మే 23వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

'హీరోపంటి' సినిమా విడుదల అవుతున్న రోజే 'కొచ్చాడయాన్' చిత్రం విడుదల అవుతోంది. కొచ్చాడయాన్ చిత్రంలో జాకీ ష్రాఫ్ మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదే రోజు తండ్రి నటించిన సినిమా విడుదలపై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ ఇది తండ్రి కొడుకుల మధ్య కాంపిటీషన్‌గా పేర్కొన్నారు.

Father-Son Competition For Tiger Shroff On May 23

వాస్తవానికి 'కొచ్చాడయాన్' చిత్రం మే 9 విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో 'హీరోపంటి' చిత్రం విడుదల మే 23న నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చేసారు. అయితే ఉన్నట్టుండి కొచ్చాడయాన్ విడుదల 23కు మారడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. టైగర్ ష్రాఫ్ ఊహించని విధంగా తొలి సినిమా విడుదల రోజే రజనీకాంత్‌తో పోటీ పడే పరిస్థితులు నెలకొన్నాయి.

'కొచ్చాడయాన్' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న జాకీ ష్రాఫ్ కూడా మారిన పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నాడట. తన కొడుకు తొలి సినిమాపై 'కొచ్చాడయాన్' ప్రభావం పడుతుందని ఆందోళనగా ఉన్నాడట. మరి తండ్రి కొడుకు సినిమాల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

English summary
Tiger Shroff is eagerly waiting for his debut film Heropanti which will hit the screens May 23 and he is happy yet nervous as Kochadaiiyaan, featuring his dad Jackie Shroff as a villain, will release the same day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu