»   » పవిత్ర మాసం లో ఇలాంటి ఫొటోలా..? దంగల్ నటి బికీనీ మీద విమర్శలదాడి

పవిత్ర మాసం లో ఇలాంటి ఫొటోలా..? దంగల్ నటి బికీనీ మీద విమర్శలదాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దంగల్‌' సినిమాలో ఆమిర్‌ఖాన్‌ కూతురు గీతా ఫోగట్‌గా ఆకట్టుకున్న ఫాతిమా సనా షైక్‌ గుర్తుంది కదా. ఆమె అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. స్విమ్‌సూట్‌ ధరించిన కొన్ని అందమైన ఫొటోలను ఈ సుందరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. మాల్దీవుల్లోని నీలిసముద్రపు తీరాల్లో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన వీటిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగానే.. కొందరు మతరక్షకులు రంగంలోకి దిగారు.

ఫాతిమా సనా షేక్‌

ఫాతిమా సనా షేక్‌

ఫాతిమా సనా షేక్‌.. 'దంగల్‌' సినిమాతో రాత్రికి రాత్రి 'పాపులర్‌' అయిపోయింది. ఎంత వేగంగా పాపులర్‌ అయ్యిందో, అంతే వేగంగా వివాదాల్లోకెక్కింది సనా షేక్‌. కారణం, ఆమె డ్రెస్సింగే. ఓ ఫొటో ఆమెని వివాదాల్లోకి లాగేసింది. సినిమా అన్నాక గ్లామర్‌ మామూలే. అలా గ్లామరస్‌గా కన్పించడంతో ఆమెకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీ అయ్యాయి. ముస్లిం మత పెద్దలంటూ కొందరు మీడియా ముందుకొచ్చి నానా యాగీ చేసిన విషయం విదితమే.

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్

అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో నాన్నతో కాస్త పొసగని కూతురుగా నాన్న చెప్పినట్లు చేసి అతని అడుగుజాడలలో నడిచిన అమ్మాయిగా చాల చక్కగా నటించిందిన ఫాతిమా షేక్.. తాజ‌గా ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' సినిమాలో అమీర్ తో ఆమె జంట‌గా న‌టిస్తోంది.. కెరీర్ మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే దంగల్ తో మంచి గుర్తింపు వచ్చింది.

గ్లామ‌ర్ ఫోటో షూట్స్ లో

గ్లామ‌ర్ ఫోటో షూట్స్ లో

గ్లామర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలే చేసిన హీరోయిన్లకే ఇక్కడ కాలం చెల్లుతుంది. అది గ్రహించి ఇప్పుడు గ్లామ‌ర్ ఫోటో షూట్స్ చేస్తున్న‌ది. మొన్నటివరకు తాను గ్లామరసానికి చాలా దూరం అని చెప్పిన ఫాతిమా సనా షేక్ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో బాగా తెలుసుకుంది.

‘అసభ్యకరమైన' ఫొటోలు

‘అసభ్యకరమైన' ఫొటోలు

అందులో భాగంగానే మాల్దీవుల్లోని నీలిసముద్రపు తీరాల్లో దిగిన ఫొటోలను షేర్‌ చేసి పవిత్ర మాసమైన రంజాన్‌లో ఇలా ‘అసభ్యకరమైన' ఫొటోలు పోస్టుచేస్తావా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆమెను కించపరుస్తూ పెద్ద ఎత్తున విమర్శలకు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది. దానికి అభ్యంతరం చెప్పడం, కించపరచడం సరికాదని ఆమె అభిమానులు పలువురు ఫాతిమాకు అండగా నిలుస్తున్నారు.

చాలా ఎదిగింది

చాలా ఎదిగింది

ఫాతిమా సనా షేక్‌ మాత్రం, తెరపై గ్లామరస్‌గా కన్పించడం ఇదేమీ కొత్త కాదనీ, గతంలోనూ చాలామంది చేశారనీ, ఇప్పుడూ చేస్తున్నారనీ చెబుతోంది. అప్పటికీ ఇప్పటికీ 'కాన్ఫిడెన్స్‌' విషయంలో చాలా 'ఎదిగింది' ఫాతిమా సనా షేక్‌. గతం లో చాలామంది బాలీవుడ్ ప్రముఖులు అండగా వచ్చారు కానీ ఈసారి మాత్రం ఎవరి సాయం లేకుండానే ఈ విమర్శలకు సమాధానం చెప్తూ ధీటుగానే నిలబడింది ఫాతిమా .

English summary
Fatima's pictures, however, garnered negative response from some netizens who shamed her for wearing a swimsuit and dressing inappropriately during the holy month of Ramzan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu