»   » నన్ను కాల్ గర్ల్ అంటున్నారు, ఇదంతా వారిపనే, అందుకే కనిపించకుండా పోయా : శ్రీరెడ్డి

నన్ను కాల్ గర్ల్ అంటున్నారు, ఇదంతా వారిపనే, అందుకే కనిపించకుండా పోయా : శ్రీరెడ్డి

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  నన్ను లంxx అంటున్నారు... ఒక్కొక్కరి తాట తీస్తా.. మరోసారి శ్రీరెడ్డి సంచలన !

  గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి గత వారం రోజులుగా కనిపించడం లేదు. ఈ వారం రోజులు ఆమె ఎవరికీ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో శ్రీరెడ్డిపై రకరకాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెను వ్యతిరేకించే వారు శ్రీరెడ్డి డబ్బు తీసుకుని మాయం అయిందంటూ ప్రచారం చేశారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్‌తో పెట్టుకుంటే ఇలాంటి గతే పడుతుందంటూ కామెంట్స్ చేశారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారానికి తెరదించుతూ మంగళవారం సాయంత్రం శ్రీరెడ్డి ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

  ఇలాంటి చర్యలతో బాధేస్తుంది

  ఇలాంటి చర్యలతో బాధేస్తుంది

  కొంత మంది చదువుకున్న మూర్ఖ్చులను చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటోంది. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, అమ్మాయిలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వారికి తెలియడం లేదు. నా లాంటి మోస పోయిన అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై సిగ్గు విడిచి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే, కొన్ని వందల మంది అమ్మాయిల కోసం పోరాడుతుంటే కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అడుక్కునేవారికి మనం రెస్పెక్ట్ ఇస్తాం, మోస పోయిన వారికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు.

  ఆ మూర్ఛులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు

  ఆ మూర్ఛులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు

  కొంత మంది చదువుకున్న మూర్ఖులు మోసం చేసిన వారిది తప్పులేదంటారు. వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు పిచ్చి పిచ్చిమెసేజ్ లు చేస్తున్నారు. మీరు నా ప్లేసులో ఉండి ఉంటే మీకు అర్థమయ్యేది. ఈ రోజు కొన్ని వందల మందిని కలుస్తూ వారి బాధలు తెలుసుకుంటున్నాను. తిని తినకుండా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వారి కేసులు గురించి పట్టించుకుంటూ ఎంతో మంది అమ్మాయిల కోసం మేము పోరాడుతుంటే మా మీద చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.... అని శ్రీరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

  నీ తల్లికో చెల్లికో జరిగితే ఇలానే చేస్తారా?

  నీ తల్లికో చెల్లికో జరిగితే ఇలానే చేస్తారా?

  మా పోరాటాన్ని కేవలం ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా ఎక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకుందామని, మనకు చేతనైన సాయం చేద్దామని రంగంలోకి దిగాం. అయితే మేము దిగిన తర్వాత మమ్మల్ని అప్ సెట్ చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నించాలో అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అనకూడని మాటలు అంటున్నారు. ఇలాంటి అన్యాయం మీ అమ్మకో చెల్లికో జరిగితే...ఇలాగే కామెంట్స్ చేస్తారా? మీరు ఎవరూ ముందుకు రాకున్నా మేము బాధ్యత తీసుకుని మాట్లాడుతుంటే మమమ్మల్ని కించ పరిచే ప్రయత్నం చేస్తున్నారు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

   ఈ రోజుల్లో ప్రతివ్రతలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు

  ఈ రోజుల్లో ప్రతివ్రతలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు

  లైవ్ జరుగుతుండగా ‘మీరంతా పతివ్రతలా?' అనే ఓ కామెంటుకు శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ.... ఈ రోజుల్లో ఎవరూ ప్రతివ్రతలు కాదు, ఈ రోజుల్లో ప్రతివ్రతలను ఎక్స్ పెక్ట్ చేయవద్దు. ఈ రోజు ఒక ఆడది బయటకు వెళుతుంటే పిచ్చి ఎదవల చూపుల నుండి తప్పించుకోవడం ఏ పతివ్రతకు చేతకాదు. వారు ఎంత పతివ్రతగా ఉన్నా కూడా వారి చూపుల్లో, చేష్టల్లో నలిగిపోవాల్సిందే. బజారుకో, మార్కెట్‌కో వెళితే అక్కడ ఇక్కడ గిల్లించుకుని రావాల్సిందే. ఇవన్నీ ఎవరూ బయటకు చెప్పుకోలేరు. మగాళ్ల పైత్యాలు మారవు.... అమ్మాయిలు మాత్రం మారిపోవాలి. మీరు మాత్రం రోడ్డు మీద ఆడవారి పట్ల ఇష్టంమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఆడవారు మాత్రం పద్దతిగా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంట్లో ఓ మూలన కూర్చుని వంట వండుకుంటూ పడి ఉండాలి? ఇలా ఆలోచించే ఎదవలు ఉన్నన్ని రోజులు అమ్మాయిలు పైకి రారు.... అంటూ శ్రీరెడ్డి మండి పడ్డారు.

  ఆ సినిమాల వల్లే ఇలా తయారైంది

  ఆ సినిమాల వల్లే ఇలా తయారైంది

  ఇండియాలో ఇలాంటి ఎదవలు ఉన్నారని చెబితే... ఆమెను టార్గెట్ చేస్తూ బిచ్, సంస్కారం లేనిది అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అమ్మాయిలను ఏడిపించడం ఇపుడు ఫాషన్ అయిపోయింది. ఎందుకంటే మన సినిమాలు కూడా మనకు అవే నేర్పించాయి. మనం అంతకన్నా ఏం నేర్చుకోలేం. సినిమాల్లో ఒక అమ్మాయిని ఏడిపించి హీరో రౌడీ వేషాలు వేస్తున్నా కూడా లవ్ చేయాలి. ఇలాంటి కాన్సెప్టులతో వచ్చే సినిమాలే మనల్ని నాశనం చేస్తున్నాయి.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

  ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉండదు

  ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉండదు

  కమిట్మెంట్ అడిగినపుడే చెప్పుతో కొట్టి ఉంటే ఈ రోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా? అని లైవ్ చాట్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శ్రీరెడ్డి స్పందిస్తూ.... ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉండదు అంటూ ఓ ఉదాహరణ చెప్పారు. నువ్వు ఒక ఆఫీసులో పని చేస్తున్నపుడు మీ ఆఫీసర్ బయటకు వెళ్లి ఏదో వస్తువు తీసుకురా అని తన సొంత పని చెబుతాడు. అది నీ డ్యూటీ కాక పోయినా నువ్వు చేస్తావు. కమిట్మెంటుకు లొంగిపోవడం కూడా అలాంటిదే అంటూ శ్రీరెడ్డి తెలిపారు.

  ఎదురు తిరిగి మాట్లాడితే అంటారు

  ఎదురు తిరిగి మాట్లాడితే అంటారు

  నాలాంటి ఒక అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడితే, మగాళ్లకు వ్యతిరేకంగా గళం విప్పితే ఆమెకు లం** అంటూ పేరు పెడతారు అంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  పబ్లిసిటీ కోసం చేయడం లేదు

  పబ్లిసిటీ కోసం చేయడం లేదు

  నేను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాను అని కొందరు నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఇపుడు పబ్లిసిటీ రాక పోయినా నేను ప్రొటెస్ట్ చేస్తున్నారు. పబ్లిసిటీ గురించి చేసే దాన్ని అయితే నా పోరాటం ఇలా కొనసాగేది కాదు అని శ్రీరెడ్డి తెలిపారు.

  ఎక్కడికీ పారిపోలేదు, డబ్బు తీసుకోలేదు

  ఎక్కడికీ పారిపోలేదు, డబ్బు తీసుకోలేదు

  ఈ వారం రోజులు కనిపించక పోవడానికి కారణం..... ఈ టెన్షన్ వాతావరణం నుండి రిలాక్స్ అవ్వడానికే. హైదరాబాద్ నుండి బయటకు వెళ్లి ఒక ట్రిప్ వేసి వచ్చాను. అంతకు మించి మరేమీ లేదు. నేను ఏమీ అయిపోలేదు, ఎక్కడికి పారిపోలేదు అని శ్రీరెడ్డి తెలిపారు. నేను 5 కోట్లు డబ్బు తీసుకున్నట్లు కొందరు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. 5 కోట్లు కాదు కదా 5 లక్షలు తీసుకున్నట్లు నిరూపించినా నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని శ్రీరెడ్డి తెలిపారు.

   మీడియా కవర్ చేయక పోయినా... నాలో పొగరు ఆగలేదు

  మీడియా కవర్ చేయక పోయినా... నాలో పొగరు ఆగలేదు

  మీడియా ఎవరికో అమ్ముడు పోతే నాకు సంబంధం లేదు. నేనైతే ఎవరికీ అమ్ముడు పోలేదు. మీడియా ఎవరికైనా భయపడితే అది నాకు సంబంధం లేదు, నేను ఎవరికీ భయపడను, ఎవరి వద్దా డబ్బులు తినను. మీడియా కవర్ చేయక పోయినా... నాలో ఉన్న పొగరు ఆగలేదు, నాలోని అగ్ని రగులుతూనే ఉంది. మేము దీన్ని ఆపం, ఇంకా తీవ్రతరం చేస్తాం.... అని శ్రీరెడ్డి తెలిపారు.

  ఆ విషయాలు మీకు పట్టవా?

  ఆ విషయాలు మీకు పట్టవా?

  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నో ప్రామిస్ లు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటీ అమలు కాలేదు. అవేమీ మీరు పట్టించుకోరు. వారం రోజులు నేను కనిపించక పోతే ఆమె డబ్బులు తీసుకుని మాయం అయిపోయింది అంటూ పిచ్చి కూతలు కూస్తారు. ఇప్పటికైనా మారండి అని శ్రీరెడ్డి సూచించారు.

  నాపై దుష్ప్రచారం చేయిస్తుంది ఆ పెద్దలే

  నాపై దుష్ప్రచారం చేయిస్తుంది ఆ పెద్దలే

  పలు యూట్యూబ్ ఛానల్స్ కొందరు పెద్ద వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. సురేష్ బాబు, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ అనుచరులు, బాబు గోగినేని అనుచరులు ఎవరైతే విమర్శలను తీసుకోలేరో అలాంటి వ్యక్తులు ఆ అమ్మాయి డబ్బులు తీసుకుందని, ఆ అమ్మాయి మంచిది కాదని, ఆ అమ్మాయి కాల్ గర్ల్ అని, మీడియా ఆ అమ్మాయిని తొక్కేసింది, పవన్ కళ్యాణ్‌తో పెట్టుకుంటే ఇంతే అవుతుంది అంటూ ప్రచారం చేయిస్తున్నారు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

  ప్రేమ, పెళ్లి గురించి...

  ప్రేమ, పెళ్లి గురించి...

  ఈ సందర్భంగా మీరు ఎవరినైనా ప్రేమిస్తారా? ప్రేమిస్తున్నారా? అనే ప్రశ్నకు శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ నేను జీవితంలో పెళ్లే చేసుకోవద్దు అనుకుంటున్నాను. లవ్ లాంటి వాటికి ఇక పూర్తిగా నేను దూరం అని శ్రీరెడ్డి తెలిపారు.

  English summary
  Actress Sri Reddy Sensational Comments on Telugu Film Industry about Casting Couch and other issues. Sri Reddy is an Indian actor and TV anchor who mainly works Telugu film industry. On April 7, 2018, Reddy staged a semi-nude protest outside the Movie Artistes’ Association (MAA) headquarters ‘Telugu Film Chamber of Commerce’ in Film Nagar, Jubilee Hills, Hyderabad. The actor made serious allegations about the rampant sexual exploitation of female actors by some of the big names in the Telugu film industry. Reddy alleged she has been denied membership in the MAA because of her recent allegations on ‘casting couch’.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more